Ninnu Chere Tarunam Streaming on Aha



గీతా సుబ్రమణ్యం వెబ్ సిరీస్‌లో  "సుబ్బు"పాత్రలో ఆకట్టుకున్న మనోజ్ కృష్ణ తన్నీరు తన తాజా చిత్రం "నిన్ను చేరే తరుణం"తో తెరపైకి వచ్చారు. ఇది ఆహాలో 50 లక్షల నిమిషాలతో విజయవంతంగా రన్ అవుతుంది. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే ప్రేమకథగా అలరిస్తోంది.

 

జూన్ 28న విడుదలైన ట్రైలర్ రాధ, కృష్ణల అందమైన ప్రేమకథ ప్రపంచాన్ని పరిచయం చేసింది. తన బ్లైండ్ నెస్ ని దాచిపెట్టిన రాధ, కృష్ణ తో గాఢంగా ప్రేమలో పడతాడు. కృష్ణ, రాధని నమ్ముతుంది. కృష్ణ, రాధను నమ్మడం, రాధ తన బ్లైండ్ నెస్ ని దాచుకోవడానికి చేసే ప్రయత్నాలు, తన సీక్రెట్ ఎప్పుడు తెలుస్తోందని భయపడటం.. ఇవన్నీ మంచి రొమాంటిక్ కామెడీ చూస్తున్న అనుభూతిని కలిస్తాయి. మరి రాధ రహస్యం కృష్ణకి తెలిసిందా? రాధ పై కృష్ణ పెట్టుకున్న నమ్మకం పోయిందా ? నమ్మకం పోయినప్పుడు ప్రేమ గెలుస్తుందా? అనేది తెలియాలంటే ఈ రొమాంటిక్ కామెడీ ని చూసి తీరాల్సిందే. నిన్ను చేరే తరుణం.. వాచ్ ఓన్లీ ఆన్ ఆహా.

 

Post a Comment

Previous Post Next Post