అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు - వ్యూహం-టీజర్ టాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘వ్యూహం’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జరిగిన పరిణామాలను, వైఎస్సార్ ఫ్యామిలీ ఎదుర్కొన్న సంఘర్షణను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర తాలూకు ఆవేదనను బాగా చూపించారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక జగన్ ని తొక్కేయాలని చేసే కుట్రలను, ప్రత్యర్థి పార్టీల కుయుత్తలను బలంగా ఎలివేట్ చేశారు.
ఈ టీజర్ జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది ?, ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? లాంటి అంశాలను ప్రస్తావిస్తూ సాగింది. టీజర్ లో నేపథ్య సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచింది. అలాగే జగన్ పాత్ర దారి చివర్లో చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. "అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు" అంటూ ఈ టీజర్ అంచనాలను పెంచేసింది. నటీనటుల విషయానికి వస్తే సీఎం జగన్గా అజ్మల్ నటిస్తుంటే… భారతి క్యారెక్టర్ను మానస పోషిస్తోంది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.
Post a Comment