Home » » Star Director Sukumar Appreciated Siddharth Roy Team

Star Director Sukumar Appreciated Siddharth Roy Team

 'సిద్ధార్థ్ రాయ్' టీమ్ ని అభినందించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ 

 


'సిద్ధార్థ్ రాయ్' చిత్రం టాక్ అఫ్ ది టౌన్ గా హెడ్ లైన్స్ లో నిలిచింది. పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్  దీపక్ సరోజ్ హీరోగా పరిచయమౌతున్న చిత్రమిది. వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 


తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ 'సిద్ధార్థ్ రాయ్' టీమ్ ని అభినందించారు. దీపక్ సరోజ్, దర్శకుడు వి యశస్వీ ని పుష్ప2 సెట్స్ కి ఆహ్వానించిన సుకుమార్ తన బెస్ట్ విషెస్ అందించారు. టీజర్ తనకి చాలా నచ్చిందని, కంటెంట్ యూనిక్ గా వుందని ప్రశంసించారు సుకుమార్. 


టీజర్ తో అందరి ద్రుష్టిని ఆకర్షించిన 'సిద్ధార్థ్ రాయ్' చిత్రానికి బిజినెస్ పరంగా బయ్యర్ల నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయి. 


శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.  


ఈ చిత్రంలో  ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తుండగా, సామ్ కె నాయుడు కెమరా మెన్ గా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు.



తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి,నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్,  మాథ్యూ వర్గీస్

సాంకేతిక విభాగం: 

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:  వి యశస్వీ 

నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన

బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & విహాన్ మరియు విహిన్ క్రియేషన్స్

లైన్ ప్రొడ్యూసర్: బి.శ్యామ్ కుమార్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సామ్ కె నాయుడు

సహ రచయితలు: అన్వర్ మహ్మద్, లుధీర్ బైరెడ్డి

సంగీత దర్శకుడు: రధన్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఆర్ట్: చిన్నా

ప్రొడక్షన్ డిజైనర్: బాల సౌమిత్రి

యాక్షన్: పృథ్వీ

కొరియోగ్రఫీ: శంకర్, ఈశ్వర్ పెంటి

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, బాలాజీ, పూర్ణా చారి,  వి యశస్వీ

పీఆర్వో: వంశీ - శేఖర్

పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను

వీఎఫ్ఎక్స్: వర్క్‌ఫ్లో ఎంటర్‌టైన్‌మెంట్స్


Share this article :