Love you Ram Song Launched by King Nagarjuna

 కింగ్ నాగార్జున లాంచ్ చేసిన కె దశరథ్, డివై చౌదరి 'లవ్ యూ రామ్' మనసు మాట వినదే పాట



క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ యూ రామ్'. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌ లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ లుక్,  టీజర్, పాట కు అద్భుతమైన రెస్పాన్స్  వచ్చింది.


తాజాగా ఈ చిత్రం నుంచి 'మనసు మాట వినదే' పాటని కింగ్ నాగార్జున లాంచ్ చేశారు.కె వేద ఈ పాటని లవ్లీ మెలోడీగా కంపోజ్ చేయగా.. దివ్య మాలిక శ్రావ్యంగా అలపించారు. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన ఈ పాటలో లీడ్ పెయిర్  కెమిస్ట్రీ అందంగా వుంది.


సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు, శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాశారు. సాయి సంతోష్ కెమెరామెన్ గా, ఎస్.బి ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు


తారాగణం: రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మల్లిక్, మీర్, కె దశరధ్, డివై చౌదరి, ప్రభావతి వర్మ, శాంతి దేవగుడి తదితరులు


సాంకేతిక విభాగం

దర్శకత్వం: డివై చౌదరి

నిర్మాతలు: కె దశరధ్, డివై చౌదరి

సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వరరావు

బ్యానర్లు: మన ఎంటర్‌టైన్‌మెంట్స్,  శ్రీ చక్ర ఫిల్మ్స్

కథ: కె దశరధ్

డీవోపీ: సాయి సంతోష్

సంగీతం: కె వేద

ఎడిటింగ్: ఎస్.బి ఉద్ధవ్

స్క్రీన్ ప్లే: కిషోర్ గోపు, శివ మొక్క

డైలాగ్స్: ప్రవీణ్ వర్మ

ఆర్ట్: గురు మురళీకృష్ణ

పీఆర్వో: వంశీ-శేఖర్

Post a Comment

Previous Post Next Post