కె. విజయభాస్కర్, ఎస్ఆర్కే ఆర్ట్స్ ఫన్ టాస్టిక్ ఎంటర్ టైనర్ 'జిలేబి' టీజర్ విడుదల
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జిలేబి'. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ ఆర్ కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన 'జిలేబి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ ఫన్ టాస్టిక్ ట్రీట్ ని ఇచ్చింది. ''మా హాస్టల్ లో వున్నది స్టూడెంట్స్ కాదు వజ్రాలు. 24 హావర్స్ చదువుతూనే వుంటారు'' అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగింది. టీజర్ మిడిల్ లో వచ్చిన హారర్ ఎలిమెంట్ హిలేరియస్ గా అనిపించింది.
దర్శకుడు విజయ్ భాస్కర్ ఫన్ ఫుల్ యూత్ ఎంటర్ టైనర్ అందించబోతున్నారని టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మొత్తానికి ఈ టీజర్ 'జిలేబి' హిలేరియస్ ఫన్ ఫుల్ రైడ్ అనే భరోసా ఇచ్చింది.
ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: శ్రీకమల్, శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు.
సాంకేతిక విభాగం:
దర్శకత్వం : కె. విజయభాస్కర్
నిర్మాత: గుంటూరు రామకృష్ణ
బ్యానర్ : ఎస్ఆర్కే ఆర్ట్స్
సమర్పణ : అంజు అశ్రాని
సంగీతం: మణిశర్మ
డీవోపీ: సతీష్ ముత్యాల
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ