Home » » Icon star Allu Arjun Graced Telugu Indian Idol 2 Grand Finale

Icon star Allu Arjun Graced Telugu Indian Idol 2 Grand Finale

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా.  స‌రికొత్త ప్రోగ్రామ్స్‌తో మెప్పించిన మ‌న ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను మంత్ర మ‌గ్దుల‌ను చేసిన ఈ ప్రోగ్రామ్‌లో ఎంతో మంది త‌మ అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌పరిచారు. ఆహా అందించిన ఈ సంగీత మ‌హోత్స‌వం గొప్ప ముగింపుతో పూర్త‌య్యింది. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 సీజ‌న్ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌టం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అభిమానుల స‌మ‌క్షంలో ఈ ఫినాలేను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించారు. అల్లు అర్జున్ ఈ సీజ‌న్ 2 విజేత‌ను ప్ర‌క‌టించారు. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా  ఆహాలో ప్ర‌సార‌మైన తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో గొప్ప సంగీత వార‌స‌త్వాన్ని ఇందులో మ‌నం అందరం వేడుక‌ల జ‌రుపుకున్నాం. 

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 షోకి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించిన సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సింగ‌ర్స్ కార్తీక్, గీతా మాధురి ఈ అసాధార‌ణ‌మైన ప్రయానంలో చాలా కీల‌క‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. వీరితో పాటు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన మ‌రో సింగ‌ర్ హేమ‌చంద్ర సైతం ప్ర‌తిభ‌ను స‌రైన రీతిలో ఆవిష్క‌రించ‌టానికి ముఖ్య భూమిక‌ను పోషించారు. హేమ చంద్ర త‌న చ‌క్క‌టి హోస్టింగ్‌తో హృద‌యాల‌కు హ‌త్తుకునేలా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. 

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో గొప్ప స్పంద‌న వ‌చ్చింది. ఎంతో మంది ప్ర‌తిభ ఉన్న సింగ‌ర్స్ 10000 మందికి పైగానే ఆడిష‌న్స్‌లో పాల్గొన్నారు. అందులో నుంచి 12 మంది టైటిల్ గెలుచుకోవ‌టానికి పోటీ ప‌డ్డారు. కొన్ని వారాల పాటు ఈ సింగ‌ర్స్ మ‌ధ్య గొప్ప పోటీ నెల‌కొంది. చివ‌ర‌గా 5 మంది.. న్యూ జెర్సీ నుంచి శ్రుతి, హైద‌రాబాద్ నుంచి జ‌య‌రాం, సిద్ధిపేట నుంచి లాస్య ప్రియ‌, హైద‌రాబాద్ నుంచి కార్తీక్, విశాఖ‌ప‌ట్నం నుంచి సౌజ‌న్య భాగవతుల .. సింగ‌ర్స్ అపార‌మైన సంగీత ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నంగా నిలిచి ఫైన‌ల్‌లోకి అడుగు పెట్టారు. వీరు త‌మ అద్భ‌/త‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌తో, శ్రావ్య‌మైన గొంతుక‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పింప చేశారు. 

ఎంతో ఉత్కంఠ‌త‌తో నువ్వా నేనా అనేంత‌లా పోటా పోటీగా జ‌రిగిన ఫైన‌ల్‌లో విశాఖప‌ట్నంకు చెందిన సౌజ‌న్య భాగ‌వ‌తుల విజేత‌గా నిలిచింది. ఆమె ఎంతో గొప్పగా అసాధార‌ణ‌మైన‌ ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచి ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్దుల‌ను చేసింది. జ‌య‌రాం, లాస్య ప్రియ‌లు ఫ‌స్ట్‌, సెకండ్ ర‌న్న‌ర‌ప్‌లుగా నిలిచారు. వీరు కూడా ఎంతో అద్భుతంగా పాడి శ్రోత‌ల‌ను అల‌రించారు. 

ఈ సంద‌ర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహావారు అందించిన తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 ఫినాలేలో పాల్గొన‌టం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. సంగీతంలో ఎంతో ప్ర‌తిభావంతులైన వీరి ప్ర‌ద‌ర్శ‌న చూసి మ‌న‌సంతా ఆనందంతో నిండిపోయింది. సంగీతంపై మ‌రింత ప్రేమ పెరిగింది. ఈ షో నాకెంతో ప్ర‌త్యేక‌మైన‌ది, మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కంగా మిగిలింద‌నాలి. సౌజ‌న్య‌కు నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఆమె అసాధార‌ణ‌మైన విజ‌యాన్ని సాధించింది. రెండేళ్ల చిన్నారికి త‌ల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొన‌టం.. ఓ వైపు సంగీతం, మ‌రో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌టం అనేది అంత సులువైన విష‌యం కాదు. ఆమె అంకిత భావం, నిబ‌ద్ధ‌త చూస్తే గౌర‌వం పెరిగింది. ఆమెకు కుటుంబం నుంచి వ‌చ్చిన మ‌ద్ద‌తు ఎంత గొప్ప‌గా ఉందో, దాని ప్రాముఖ్య‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే ఆమె భ‌ర్త నుంచి ల‌భించిన స‌హ‌కారం, ప్రేమ చూస్తే ఆమె ఎంతో అదృష్ట‌వంతురాల‌ని అనిపిస్తుంది. పెళ్లైన ప్ర‌తి స్త్రీ వెనుక ఆమె భ‌ర్త స‌హ‌కారం ఎంతో అందించాలి. అలా ఉన్నప్పుడు మ‌హిళ‌లు వారి అనుకున్న ల‌క్ష్యాల‌ను సుల‌భంగా చేరుకుంటారు. అది వారి ఉనికిని అంద‌రికీ తెలిసేలా చేస్తుంది. సౌజ‌న్య సాధించిన ఈ విజ‌యం అంద‌రికీ ఎంతో స్ఫూర్తినిచ్చేది. ఆమె సంగీత ప్ర‌యాణంలో ఇలాంటి విజ‌యాల‌ను మ‌రెన్నింటిలో అందుకోవాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 

తెలుగు ఇండియన్ ఐడల్ 2 విజేతగా నిలిచిన సౌజన్య భాగవతుల మాట్లాడుతూ ‘‘ఆహా వారి తెలుగు ఇండియ‌న్ 2లో విజేత‌గా నిల‌వ‌టం, ముఖ్యంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవ‌టం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. క‌ల నిజ‌మైన‌ట్లు ఉంది.  ఆయ‌న అందించిన ప్రోత్సాహం, ప్ర‌శంస‌లను నేనెప్ప‌టికీ మ‌ర‌చిపోను. ఈ మ్యూజిక‌ల్ జ‌ర్నీ నాలోని ప‌ట్టుద‌ల‌ను మ‌రింత‌గా పెంచింది. ఇంత గొప్ప వేదిక‌ను అందించిన ఆహా వారికి, న్యాయ నిర్ణేత‌ల‌కు, నా తోటి కంటెస్టెంట్స్‌కు, మా వెనుక ఉండి ప్రోత్స‌హించిన టీమ్‌కి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. జీవితంలో ఈ క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఇంకా గొప్ప‌గా రాణించ‌టానికి ప్ర‌య‌త్నిస్తాను’’ అన్నారు. 

ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2 ’సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. రియాలిటీ షోల రంగంలో కొత్త ప్రమాణాలను క్రియేట్ చేయటం విశేషం. ఎంతో విజ‌యంతంగా ముగిసిన ఈ సీజ‌న్ 2 లో అసాధార‌ణ‌మైన ప్ర‌తిభ‌ను ప్రద‌ర్శించ‌టంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తిరుగులేని వినోదాన్ని అందించి త‌న నిబ‌ద్ద‌త‌ను మ‌రోసారి స‌గ‌ర్వంగా చాటుకుంది ఆహా.

సౌజ‌న్య భాగ‌వ‌తుల ప్ర‌యాణాన్ని తెలుసుకోవాలంటే ‘ఆహా’ను స్ట్రీమింగ్ కావాల్సిందే.Share this article :