Nandamuri Balakrishna Launched the IQ Movie Trailer

 సందేశాత్మక చిత్రాన్ని ఆదరించాలి..

‘ఐక్యూ’ ట్రైలర్‌ ఆవిష్కరణలో బాలకృష్ణ




సాయిచరణ్‌, పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ ద స్టూడెంట్‌’ అన్నది ఉపశీర్షిక. జిఎల్‌బి శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎల్‌.పి మూవీస్‌ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతం కావాలని నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలని బాలకృష్ణ అభిలషించారు. ‘స్టూడెంట్‌ పవరః అంటే ఏంటో చెప్పే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. 

నిర్మాత మాట్లాడుతూ ‘‘చక్కని కథతో సాగే చిత్రమిది. స్టూడెంట్స్‌ తలచుకుంటే ఏమైనా చేయగలరు అన్న ఇతివృత్తంతో దర్శకుడు చక్కగా తెరకెక్కించారు. బాలకృష్ణగారి చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా టీమ్‌ తరఫున కృతజ్ఞతలు. గతంలో కూడా ఆయన మాకు ఎన్నో రకాలుగా సహకరించారు. జూన్‌ 2న సినిమాను గ్రాండ్‌గా  విడుదల చేస్తాం’’ అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి, రాయల్‌ మురళీ మోహన్‌, రైటర్‌ ఘటికాచలం, దండు శ్రీనివాసులు,  శ్రీధర్‌ లక్ష్మీ నరసింహ వెంకటప్ప, అంబిక లక్ష్మీనారాయణ వడ్డే గోకుల్‌ లోకనాథ్‌తోపాటు చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నటీనటులు

లేఖ ప్రజాపతి

ట్రాన్సీ

సుమన్‌

బెనర్జీ

సత్యప్రకాష్‌

పి.రఘునాథ్‌రెడ్డి

కె.లక్ష్మీపతి

సూర్య

గీతాసింగ్‌

షేకింగ్‌ శేష్‌

సత్తిపండు

సమీర్‌ దత్తా

సాంకేతిన నిపుణులు:

కెమెరా: టి.సురేందర్‌రెడ్డి

సంగీతం: పోలూర్‌ ఘటికాచలం

ఎడిటింగ్‌: శివ శర్వాణి

కో-డైరెక్టర్‌-కో రైటర్‌

దివాకర్‌ యడ్ల 

పిఆర్వో: మధు వి.ఆర్‌

నిర్మాత: కాయగూరల లక్ష్మీపతి

దర్శకత్వం:  జిఎల్‌బి శ్రీనివాస్‌

Post a Comment

Previous Post Next Post