Home » » Malli Pelli Success Meet

Malli Pelli Success Meet

సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా ‘’మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని సవినయంగా  కృష్ణ గారికి అంకితం చేస్తున్నాను: 'మళ్ళీ పెళ్లి' బోల్డెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో డా. నరేష్ వి.కెనవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ 'మళ్ళీ పెళ్లి'. మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన, దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 26న విడుదలైన ఈ చిత్రం బోల్డెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రసీమలో50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు డా. నరేష్ వి.కె ను సెలబ్రెటీ వరల్డ్ రికార్డ్ తో సత్కరించారు.


సక్సెస్ మీట్ లో డా. నరేష్ వి.కె మాట్లాడుతూ.. ఒక సినీ కుటుంబంలో పుట్టడం, సినిమాల్లోకి రావడం, 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. తన భార్య ఆలోచనలని ప్రజల్లోకి తీసుకు రావడానికి సూపర్ స్టార్ కృష్ణ గారు విజయ కృష్ణ మూవీస్ ప్రారంభించారు. ఇది ప్రపంచంలో చాలా అరుదు. రియల్ బోల్డెస్ట్ కపుల్ అంటే కృష్ణ గారు, విజయ నిర్మల గారు. వాళ్ళ రథం మళ్ళీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్ మళ్ళీ ప్రారంభించాను. చాలా సంతోషంగా గర్వంగా వుంది. మళ్ళీ పెళ్లి కి వచ్చిన రిజల్ట్ తో కృష్ణగారు, విజయ నిర్మల గారి ఆశీస్సులు అందుకున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా సవినయంగా సగర్వంగా మళ్ళీ పెళ్లి చిత్రాన్ని కృష్ణ గారికి అంకితం చేస్తున్నాను. యంఎస్ రాజు ఈ కథ చెప్పినపుడు ఇలాంటి సినిమా విజయ్ కృష్ణ మూవీస్ ఖచ్చితంగా రావాలని అనుకున్నాం. ఎంటర్ టైన్ మెంట్, మెసేజ్ కలిపితే మళ్ళీ పెళ్లి. ఈ సినిమాని  నేను, పవిత్ర, టీం అంతా ఇష్టపడి చేశాం. రాజు గారు అద్భుతమైన సినిమా ఇచ్చారు. మాస్ క్లాస్ యూత్ ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ రోజురోజుకి పెరుగుతున్నారు. సురేష్ ప్రొడక్షన్ వారికి కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా డిస్ట్రిబ్యుట్ చేశారు. మా పీఆర్వో వంశీ శేఖర్ టీంకి కృతజ్ఞతలు. జునైద్ చాలా అద్భుతంగా ఎడిట్ చేశారు. బాల్ రెడ్డి ఎక్స్ లెంట్ విజువల్స్ ఇచ్చారు. సురేష్ బొబ్బిలి, ఆరుళ్ దేవ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్ళీ పెళ్లి మ్యూజికల్ హిట్. శరత్ బాబు గారిని చాలా మిస్ అవుతున్నాను. జయప్రద గారు నా పక్కన ఎప్పుడూ ఒక అమ్మగా నిలబడుతుంది. ఆమె ఈ పాత్ర చేయడం ఆ పాత్రకి నెక్స్ట్ లెవల్ ఎలివేషన్ వచ్చింది.  మీడియా ఎంతగానో సహకరించింది. చాలా మంచి రివ్యూలు ఇచ్చారు. కన్నడ వెర్షన్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఒక తెలుగు నటుడిగా చాలా గర్వంగా వుంది. కన్నడ రిలీజ్ తర్వాత పెద్ద ఓటీటీ రిలీజ్ వుంటుంది. నేను బ్రతికున్నంత కాలం యాక్టింగే చేస్తా. మంచి కథలు వుంటే తీస్తా. సోషల్ సర్విస్ చేస్తా. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.


పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. జీవితానికి సంబధించిన సీక్రెట్స్ కి ఎవరూ బయటికి చెప్పారు. కానీ కొన్ని సార్లు సీక్రెట్లు చెప్పాల్సిన అవశ్యత వుంటుంది. ఇది సమాజంలోని కథ అనుకుంటే మేము గెలిచినట్లే. మళ్ళీ పెళ్లి చిత్రాన్ని విమర్శనాత్మకంగా సపోర్ట్ చేస్తున్నారు. యంఎస్ రాజు గారు చాలా అందమైన చిత్రం తీశారు. ఆయన అనుభవం అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి చిత్రం నరేష్ గారి వలనే సాధ్యమైయింది. ఈ చిత్రంలో విజయ కృష్ణ మూవీస్ ని మళ్ళీ ప్రారంభించడం ఆనందంగా వుంది. ఇందులో నా పాత్ర ద్వారా మహిళలు వారి హక్కుల కోసం నిలబడితే  ఆనందపడతాను. సమాజం మహిళని గౌరవిస్తే ఆనందంగా పడతాను’’ అన్నారు.


సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘మళ్ళీ పెళ్లి’ సినిమాని ఇంత పెద్ద విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి, యంఎస్ రాజు  గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ తెలిపారు. ఈ సక్సెస్ మీట్ లో రవి వర్మ,  అన్నపూర్ణ, వరప్రసాద్ మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


Share this article :