తుమ్మలపల్లి రామసత్యనారాయణకు
"సినీ విరాట్" బిరుదు ప్రదానం!!
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ "సినీ విరాట్" బిరుదు ప్రదానం చేసింది. 2004లో నిర్మాణరంగంలోకి ప్రవేశించిన రామ సత్యనాాయణ భీమవరం టాకీస్ బ్యానర్ పై ఇప్పటికి 101 సినిమాలు నిర్మించి రికార్డ్ క్రియేట్ చేయడాన్ని పురస్కరించుకుని ఈ బిరుదు ఇచ్చారు. ఈ బిరుదు ప్రదాన కార్యక్రమానికి విశ్రాంత సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, ప్రముఖ నటులు సుమన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, "వంశీ" రామరాజు పాల్గొన్నారు. సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొన్న జేడీ... రామ సత్యనారాయణ సమాజానికి ఉపయోగపడే మరిన్ని చిత్రాలు తీయాలని సూచించారు. రామ సత్యనారాణ లాంటి నిర్మాతలు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమని హీరో సుమన్ అన్నారు.
డి.రామానాయుడు స్పూర్తితో సినిమా నిర్మాణం చేపట్టానని తెలిపిన తుమ్మలపల్లి... లెజెండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావుతో త్వరలో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నానని అన్నారు. సినిమానే శ్వాసగా, ధ్యాసగా, సర్వస్వంగా భావించే రామ సత్యనారాయణను "సినీ విరాట్" బిరుదుతో గౌరవించుకోవడం గర్వంగా భావిస్తున్నామని వంశీ రామరాజు అన్నారు!!
Post a Comment