ధనుష్, అరుణ్ మాథేశ్వరన్, టి.జి. త్యాగరాజన్, సత్యజ్యోతి ఫిల్మ్స్ 'కెప్టెన్ మిల్లర్' ఫస్ట్ లుక్ జూన్, టీజర్ జూలైలో విడుదల
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ “కెప్టెన్ మిల్లర్” . 1930-40ల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టి జి త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే స్టన్నింగ్ మేకింగ్ విజువల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా మేకర్స్ ఎక్సైటింగ్ అప్డేట్ తో వచ్చారు. ఫస్ట్ లుక్ , టీజర్ రిలీజ్ టైం ని అనౌన్స్ చేశారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ జూన్ లో, టీజర్ జూలై లో విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చేతిలో పెద్ద గన్ పట్టుకొని యుద్ధభూమిలో నడుస్తూ వెళ్ళడం టెర్రిఫిక్ గా వుంది.
జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, శ్రేయాస్ కృష్ణ డీవోపీ గా పని చేస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.
'కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్ తదితరులు
సాంకేతిక విభాగం :
రచయిత, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్ , సాయి సిద్ధార్థ్
సమర్పణ: టీజీ త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: నాగూరన్
ఆర్ట్: టి.రామలింగం
పీఆర్వో: వంశీ శేఖర్
Post a Comment