Hero Venkat New Movie Launched

వెంకట్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ ప్రారంభం !!!



మైత్రి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ గా తెరకెక్కబోతున్న సినిమా ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజ్ తాళ్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.   ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నటుడు అలీ, నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకులు వైవిఎస్. చౌదరి, వేణు ఉడుగుల, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు. 


ఈ చిత్ర ప్రారంభోత్సవంలో సుచిరిండియా కిరణ్ క్లాప్ కొట్టగా, దర్శకులు వేణు ఉడుగుల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి వైవిఎస్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు.


క్రైం కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో వెంకట్ ,రవిందర్ రెడ్డి, ఆదిత్య, మహేష్ విట్ట, వెంకట్, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ నటిస్తున్నారు. త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు. 



ఈ సందర్భంగా దర్శకులు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ...

మంచి కాన్సెప్ట్ తో అందరికి నచ్చే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 10నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు ప్రవీణ్ రెడ్డి గారు వాసుదేవగార్ల సహకారం మారువలేనిని అన్నారు.


నిర్మాత ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ...

దర్శకులు రామ్ తాళ్లూరి గారు మంచి స్క్రిప్ట్ చెప్పారు. ఈ కథ నచ్చి వెంటనే సినిమా చేద్దాం అని చెప్పాను. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని నమ్మకం ఉంది. అందరికి నచ్చే సినిమాతో మీ ముందుకు వస్తున్నాము అన్నారు. 


నటీనటులు:

హీరో వెంకట్ ,రవిందర్ రెడ్డి, శ్రీహరి, ఆదిత్య, మహేష్ విట్ట, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ


నిర్మాత: ప్రవీణ్ రెడ్డి, వాసుదేవరావ్, 

దర్శకుడు: రాజ్ తాళ్లూరి

కెమెరామెన్: సన్నీ

Post a Comment

Previous Post Next Post