దేవరాజ్ తనయుడు హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న "వైరం" చిత్రం టీజర్ గ్రాండ్ లాంచ్
యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్,సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ పై దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు సాయి శివం జంపాన దర్శకత్వంలో జె.మల్లికార్జున నిర్మిస్తున్న చిత్రం "వైరం".. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ నటులు దేవరాజ్, చంద్ర దేవ రాజ్ ల చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, బెనర్జీ, కాశీ విశ్వనాధ్ చేతుల మీదుగా వైరం టీజర్ విడుదల చేయడం జరిగింది.అనంతరం
సీనియర్ నటులు దేవరాజ్, మాట్లాడుతూ...తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు వస్తున్న నా కొడుకును కూడా అదేవిదంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకుడు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా టీజర్ కు కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీజర్ కు కూడా అంతే బాగుందని చెపుతున్నారు. ఎంతో కష్టపడి తీసిన నిర్మాత మల్లికార్జునకు ఈ సినిమామా మంచి పేరు తెస్తుంది. KGF లాంటి సినిమాలో నటించిన గరుడ రామ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత జె.మల్లికార్జున మాట్లాడుతూ..దర్శకుడు సాయి చెప్పిన కథ నచ్చడంతో ఈ కథ ను దేవరాజ్ గారికి చెప్పడం జరిగింది.మా స్టోరీ ని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన దేవరాజ్ కు, తనయుడు ప్రణం దేవరాజ్ కు ధన్యవాదములు. ప్రణం ఇందులో బాగా చేశాడు. మా గురువు అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు, టెక్ lనిషియన్స్ తదితరులు మాకు సపోర్ట్ గా నిలవడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన మాట్లాడుతూ.. ఇది తెలుగు, కన్నడ లో బై లింగ్వేల్ సినిమా చేశాము.కన్నడలో మంచి హీరో అయిన ప్రజ్వల్ దేవరాజ్, ప్రణం దేవరాజ్ కు వీరి తండ్రి దేవరాజ్ గారికి నేను చెప్పిన నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను దేవరాజ్ వంటి స్టార్ హీరో కొడుకు నా సినిమాలో హీరో గా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. గరుడ రామ్ ఈ సినిమా చేస్తాడా లేదా అనుకున్నాను. తనకు ఈ కథ నచ్చి చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.. ఇందులో నటించిన వారందరు చాలా బాగా నటించారు. అందుకే సినిమా బాగా వచ్చింది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత మల్లికార్జున గారికి నా ధన్యవాదములు అన్నారు.
చిత్ర హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. సాయి గారు నాకు మంచి సినిమా ఇచ్చారు.సామల భాస్కర్ గారు మమ్మల్ని చాలాబాగా చూయించారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. మా తల్లి తండ్రులు సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడై వరకు వచ్చే వాన్ని కాదు.తెలుగు ప్రేక్షకులు మా నాన్న దేవరాజ్ గారిని ఆదరించి నట్లే వైరం సినిమాతో వస్తున్న నన్ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాను.
కో ప్రొడ్యూసర్ అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి మాట్లాడుతూ.. ఆశలమధ్య అవకాశాల మధ్య పట్టువదలని విక్రమార్కుడు లాగా ఈసినిమా నెలాబెట్టడానికి తను చాలా కస్టపడ్డాడు. దర్శకుడు మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. హీరో రేపటి తరానికి మంచి కథనాయకుడుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విన్ను కూడా ఈ సినిమలో చాలా బాగా నటించాడు.మంచి కథతో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు విన్ను మద్ది పాటి మాట్లాడుతూ.. వైరం సినిమా ఇది హై ఓల్టేజ్ పవరన్న సినిమా వైరం. దేవరాజ్ దంపతులు చాలా మంచి వ్యక్తులు. వారి తనయుడు ప్రణం దేవరాజ్ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్న తనను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు అక్కున చేర్చుకుంటారు. ఎన్నో కష్టాల నుంచి వచ్చిన సినిమా ఇది. నిర్మాత చాలా కష్టపడ్డాడు.. దర్శకుడు సాయి ఎన్నో కథలు రాసుకొని చక్కని సినిమాలు తీస్తున్నాడు. తనకు పెద్ద దర్శకుడు లక్షణాలు ఉన్నాయి. ప్రణం దేవరాజ్ ను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను
కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ కి వస్తున్న ప్రణం కు వెల్ కం చెపుతున్నాము. దేవరాజ్ ఫ్యామిలీ యూనిట్ ను చాలా బాగా చూసుకున్నారు.. గరుడ రామ్, విన్ను, మోనాల్ అందరూ ఇందులో చాలా బాగా నటించాడు. ఈ సినిమాకు మల్లికార్జున చాలా స్ట్రగుల్ పడ్డాడు. వీరికి కష్టానికి తగ్గ ప్రతి ఫలం కచ్చితంగా లభిస్తుంది. దర్శకుడు సాయి శివన్ మంచి కథను సెలెక్ట్ చేసుకుని చాలా బాగా తీశాడు. ఈ టీజర్ చూసిన తరువాత మంచి మాస్ డైరెక్టర్ అవుతాడు. తను ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
గెస్ట్ గా వచ్చిన బెనర్జీ మాట్లాడుతూ.. దేవరాజ్ గారు మంచి నటుడు. ఇప్పుడు తన కొడుకు హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.నిర్మాత జె.మల్లికార్జున మంచి కథ ఉన్న సినిమా తీస్తున్నాడు. తనకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
గరుడ రామ్ మాట్లాడుతూ.. దేవరాజ్ గారి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అయిన నేను వారి కొడుకుతో నటిస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.KGF చాప్టర్ 1 రిలీజ్ టైం లో దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. ప్రణవ్ తో చేస్తుంటే నా తమ్ముడు తో చేస్తున్నట్లు ఉంది. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు
హీరోయిన్ మోనల్ మాట్లాడుతూ. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
నటీ నటులు
ప్రణం దేవరాజ్, విన్ను మద్ది పాటి, మోనల్,, గరుడ రామ్, కాశీ విశ్వనాధ్, శత్రు, చమ్మక్ చంద్ర, భద్రం తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాత : జె.మల్లికార్జున
డైరెక్టర్ : సాయి శివన్ జంపాన
కో ప్రొడ్యూసర్స్ : అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు
మ్యూజిక్ : మహతి స్వర సాగర్
డి ఓపి : సామల భాస్కర్
ఎడిటర్ : అజయ్ యం.కుమార్
కొరియోగ్రాఫర్ : శిరీష్,భూషణ్ మురళి
స్టంట్స్ : మాస్ మధ, రాం సుంకర, లయన్ జి.
ఆర్ట్ : రవి కుమార్ ఎం
పి ఆర్ ఓ : హర్ష