Home » » Aha New Sense Teaser Launched

Aha New Sense Teaser Launched

 ఆహాలో స‌రికొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’.. టీజర్ విడుదల న్యూసెన్స్ సీజన్ 1లో ప్రధాన తారాగణంగా నవదీప్, బిందు మాధవి

మీడియా గురించి ఆలోచన రేకెత్తించే సరికొత్త క‌థాంశం


హైద‌రాబాద్‌, మార్చి 22 2023:  తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న 100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో స‌రికొత్త ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ న్యూసెన్స్ సీజ‌న్ 1 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీని టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. శ్రీ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ 2వ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సిరీస్‌ను నిర్మించారు. న‌వ‌దీప్, బిందు మాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


1990-2000 ద‌శ‌కంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ద‌న‌ప‌ల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్ల‌బ్‌లోని స్ట్రింగర్స్ గురించి తెలియ‌జేసిన ప‌వ‌ర్‌ఫుల్ వెబ్ సిరీస్‌గా నూసెన్స్ సీజ‌న్ 1న రూపొందిస్తున్నారు. ఇది మ‌న స‌మాజంలో ఎంతో ప్రాధాన్యత క‌లిగిన మీడియా పాత్ర ఏంటి? అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతుంది. లంచ‌గొండి సంస్కృతి పెరిగిపోవ‌టం, వార్త‌ల ప్రాధాన్య‌త‌, సెన్సేష‌న్ న్యూస్ వెనుక ప‌రుగులు తీయ‌టం అనే అంశాల‌ను ఈ సిరీస్‌లో ప్ర‌స్తావిస్తున్నారు. 


న్యూసెన్స్ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే మీడియాలో ఎవ‌రికీ క‌నిపించ‌కుండా దాగున్న క్రూర‌మైన నిజాయ‌తీని తెలియ‌జేసేలా ఉంది. ఎలాంటి క‌ల్పితాలు లేని భావోద్వేగాలు, చెప్పాల‌నుకున్న విష‌యాన్ని నేరుగా చెప్పిన తీరుతో పాటు స‌ద‌రు పాత్ర‌ల్లో న‌టించిన న‌టీన‌టుల అద్భుత‌మైన న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ అనుభూతిని క‌లిగిస్తుంద‌నటంలో సందేహం లేదు. ఓ బ్రేకింగ్ న్యూస్‌ను ఎంపిక చేసుకునే సంద‌ర్భంలో మ‌న‌లో తెలియ‌ని నైతిక సందిగ్ధ‌త నెల‌కొని ఉంటుంది. ఎందుకంటే నిజ‌మైన వార్త‌ను చెప్పాలా, ప్ర‌జాద‌ర‌ణ పొందే వార్త‌ల‌ను బ్రేకింగ్ న్యూస్‌గా ఎంపిక చేసుకోవాలా అనే ఆలోచ‌న‌లు ఎప్పుడూ ఉంటాయి. ప్ర‌స్తుతం జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న ఉద్వేగ‌భ‌రిత‌మైన స‌వాళ్ల‌ను కూడా న్యూసెన్స్‌లో ఆవిష్క‌రించ‌బోతున్నారు.  టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా..


‘‘ఒక స‌మాజంలో ఉండే వ్య‌క్తులుగా మ‌నం నిజాల‌ను తెలుసుకోవ‌టానికి జవాబుదారీతనాన్ని పెంచ‌టానికి మీడియాపై ఆదార‌ప‌డ‌తాం. వాటిని మ‌న క‌ళ్లు, చెవులుగా భావిస్తాం. అలాంటి మీడియా త‌న‌కు తానుగా రాజీప‌డితే ఎలా? న్యూసెన్స్ సీజ‌న్ 1 సిరీస్ నేటి జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న నైతిక సందిగ్ధ‌త గురించి లోతుగా ప్ర‌శ్నించే శ‌క్తివంతమైన ఆలోచ‌న‌ను రేకెత్తించే వెబ్ సిరీస్‌.  స‌త్యాన్ని అది ఎలాంటి దాప‌రికాలు లేకుండా నిజాయ‌తీగా చూపించిన తీరు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 


దర్శకుడు శ్రీప్రవీణ్ మాట్లాడుతూ ‘‘కచ్చితంగా చెప్పాల్సిన కథ ఇది. న్యూసెన్స్ సీజ‌న్ 1 అనేది మీడియాలో దాగున్న క‌ఠిన‌మైన వాస్త‌వాల‌ను, ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల్సిన వార్త‌ల‌ను జ‌ర్న‌లిస్టులు ఎలా ఎంపిక చేసుకుంటున్నారు అనే దాన్ని తెలియ‌జేస్తుంది. మీడియాలో నైతిక‌త‌, స‌మాజంలో మీడియా పాత్ర అనే దాని గురించిమాట్లాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు. న్యూసెన్స్ సీజన్ 1 అతి త్వరలోనే మన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్ష‌కుల‌కు  స్ఫూర్తిని క‌లిగిస్తూ, ఛాలెంజింగ్‌గా, ఆలోచింప చేసేదిగా ఈ సిరీస్ ఉంటుంది. 


 శ‌క్తివంత‌మైన‌, ఆలోచ‌న‌ను రేకెత్తించే న్యూసెన్స్ సీజ‌న్ 1ను మీ ఆహాలో చూసే అవ‌కాశాన్ని అస‌లు వ‌దులుకోకండిShare this article :