Children Film Vennelochindhi launched under Ratnakar Direction

 

రత్నాకర్ దర్శకత్వం లో వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ప్రారంభం




హైదరాబాద్: జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్ కనపర్తి రత్నాకర్  దర్శకత్వం వహిస్తున్న వెన్నెలొచ్చింది చిత్ర షూటింగ్ ఆదివారం మాదాపూర్ లోని జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైనది. ముఖ్య అతిధిగా  ఆ నలుగురు చిత్ర నిర్మాత ప్రేమకుమార్ పట్రా ముఖ్యఅతిథిగా పాల్గొని నటీనటులపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో రత్నాకర్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారని వెన్నెలొచ్చింది చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడం హర్షణీయం. చైల్డ్ సూపర్ స్టార్ మాష్టర్ బాను ప్రకాష్, మాస్టర్ జోవెన్ లు హీరోలుగా నటిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ  విద్య యొక్క అవసరతను తెలియజేస్తూ , పూర్తి సందేశాత్మకం గా సాగుతుందన్నారు.

 రాజయోగం చిత్ర దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ రత్నాకర్ ప్రతిభ గల దర్శకుడన్నారు. ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక,  గేయ రచయిత డాడి  శ్రీనివాస్,  చిత్తరంజన్, ప్రేమ్ కమల్, హీరోయిన్ అర్పిత, గాయని భవ్య, రామకృష్ణ, కె. సత్యప్రసాద్, శ్రీను, కేశవ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post