Home » » Veera Simha Reddy Success Celebrations Held Grandly

Veera Simha Reddy Success Celebrations Held Grandly

 ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి ఇంత పెద్ద ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: వీరసింహారెడ్డి వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ



- నందమూరి బాలకృష్ణ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని వందశాతం ఫుల్ ఫిల్ చేసుకున్నాను- దర్శకుడు గోపిచంద్ మలినేని


- వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి ఆల్ టైం రికార్డ్ : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు


గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన 'వీరసింహారెడ్డి' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.


వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘అఖండ’ తర్వాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు.  దానికి ధీటుగానే ఒక సినిమా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఒక మంచి సినిమాని ఇవ్వగలమనే నమ్మకంతో చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యాక్షన్ సినిమా చేద్దామని నేను దర్శకుడు అనుకున్నాం. దిని కోసం  వీరసింహారెడ్డి కథని ఎన్నుకున్నాం. దీనికి అద్భుతమైన మాటలు సాయి మాధవ్ బుర్రా అందించారు. తమన్ అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం అందించారు. రామ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు అద్భుతంగా చేయడం జరిగింది. ఇది అందరి సమిష్టి కృషి. వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత్రని అద్భుతంగా చేశారు. అన్న చెల్లులు అనుబంధం అద్భుతంగా ట్రీట్ చేయడం జరిగింది. శ్రుతి హాసన్ చక్కగా నటించారు. అలాగే దునియా విజయ్, తోపాటు అన్ని పాత్రలు కు నటీనటులు న్యాయం చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని అందరి నుండి ప్రతిభని రాబట్టుకునే సామర్ధ్యం వున్న దర్శకుడు. నా అభిమాని చిత్రాన్ని ఎంతోఅ అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది.  ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరున అభినందనలు. సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా వీరసింహా రెడ్డి. ప్రేక్షకులు, అభిమానులు, స్నేహితులు, అందరినుండి అద్భుతమైన ఆదరణ వస్తోంది. థియేటర్ లో అన్నా చెల్లులు మధ్య సన్నివేశాలు చూస్తుంటే మహిళా ప్రేక్షకులే కాదు మగవాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. నవరసాలు సమపాళ్లలో వున్నాయని ఈ సినిమా విజయం తెలియజేస్తోంది.  మా నిర్మాతలు రవి, నవీన్ సినిమాని ఎంతో ప్యాషన్ గా తీస్తారు. నాకు తగ్గ సినిమా తీయలాని వారి తపన ఈ సినిమా ఖర్చు విషయంలో కనిపిస్తుంది. అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన విజయం చేసిన ప్రేక్షకులకు, అభిమానులు మరోసారి కృతజ్ఞతలు.అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ తెలియజేశారు.


దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి ని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మొత్తం నైజాంలో 54 థియేటర్స్ లో నాలుగు గంటలకు షో పడటం ఒక రికార్డ్.. రాత్రి పన్నెండు ఓపెన్ చేస్తే అరగంటలో టికెట్స్ అన్నీ అయిపోయాయి. జనాలు అంతా వెయిటింగ్ లో వచ్చి సినిమా చూశారు. ఇది మామూలు విషయం కాదు. గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని వందశాతం ఫుల్ ఫిల్ చేసుకున్నానని బలంగా నమ్ముతున్నాను. ఉదయం నుండి వస్తున్న ఫోన్ కాల్స్, అభినందనలే దీనికి నిదర్శనం. నా కెరీర్ లో ఇన్ని ప్రసంశలు ఎప్పుడూ రాలేదు . బాలయ్య బాబుని ఎక్స్ ట్రార్డినరీ గా చుపించారని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు లాంటి మాస్ హిస్టీరియాని చూశామని ప్రేక్షకులు అనడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ఒక భాద్యతగా చేశాను. ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేయాలని కంకణం కట్టుకొని చేశాను. మైత్రీ మూవీ మేకర్స్ గొప్ప సపోర్ట్ ఇచ్చారు. నవీన్ , రవి గారికి థాంక్స్.   బాలయ్య బాబుపై నాకు వున్న అభిమానాన్ని స్క్రీన్ పై చూశారు. దీనికి గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. బాలయ్య బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమాకి రావడం, అది నా సినిమా కావడం చాలా ఆనందంగా వుంది. యూఎస్ లో 708k కలెక్ట్ చేసి ఇంకా కంటిన్యు అవుతుంది. ఇక్కడ అన్ని చోట్ల నుండి ఎక్స్ ట్రార్డినరీ ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా ఆనందంగా వుంది. బాలయ్య బాబు గారి ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. యూత్ కి ఈ సినిమా భీవత్సంగా కనెక్ట్ అయ్యింది. ఇందులో ఎక్స్ ట్రార్డినరీ ఎమోషన్ వుంది. అది అందరికీ సర్ప్రైజ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లోఏడవకుండా బయటికి వచ్చే వాళ్ళు లేదు. మాస్ గాడ్ సినిమాలో కన్నీళ్లు పెట్టించడం మామూలు విషయం కాదు. శ్రుతి హాసన్ ఎక్స్ ట్రార్డినరీ చేసింది. వరలక్ష్మీ భానుమతి పాత్ర చేసిన విధానం అద్భుతం. దునియా విజయ్ ఎక్స్ ట్రార్డినరీ గా చేశాడు. హానీ రోజ్ పాత్ర చాలా ఎమోషనల్ గా చేసింది. తమన్ ఎక్స్ ట్రార్డినరీ గా సౌండ్ డిజైన్ చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేశాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నా ఆయుధాలు. మాములుగా యాక్షన్ డిజైన్ చేయలేదు. కుర్చీ ఫైట్ మాములుగా లేదు. ప్రకాష్ గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. రికార్డ్ కలెక్షన్స్ తో సినిమా మొదలైయింది. బాలయ్య బాబు, మైత్రీ మూవీ మేకర్స్, నా కెరీర్ లో ఇది బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్’’ అన్నారు


నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి పెద్ద హిట్ అవుతుందని ఊహించాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ ని సాధించింది. అన్ని చోట్ల రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. ఫస్ట్ డే (ఇంకా సెకండ్  షోలు పడాలి)  50 కోట్ల గ్రాస్ దాటుతోంది. ఇది పెద్ద రికార్డ్. నైజం, సీడెడ్ , ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర ప్రతి చోట అద్భుతమైన కలెక్షన్స్ చేస్తోంది. యూఎస్ లో 708k గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది బాలకృష్ణ గారి ఆల్ టైం రికార్డ్. ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు, అభిమానులు బాలకృష్ణ గారి విశ్వరూపం చూశామని అభినందిస్తున్నారు. బాలకృష్ణ గారితో ఎప్పటి నుండో సినిమా చేయాలని అనుకుంటున్నాం. సినిమాతో ఆ కల నేలవేరింది. బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్  ని మాకు ఇచ్చినందుకు ఆనందంగా వుంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేని గారికి థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. తమన్ అంచనాలు మించి మ్యూజిక్ ఇచ్చారు. వరలక్ష్మీ గారు ఎక్స్ ట్రార్డినరీ గా యాక్ట్ చేశారు. ఈ పండగ మరో నెల రోజుల వరకూ ఆగదు. వరల్డ్ మొత్తం షేక్ చేయబోతుంది. ప్రేక్షకుల అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.  


నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అన్ని చోట్ల నుండి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి రోజే 50 కోట్ల గ్రాస్ దాటుతోందంటే .. ఇది భారీ హిట్ అని అనుకోవచ్చు. ప్రతి జిల్లా నుండి బిగ్ నెంబర్స్, షాకింగ్ నెంబర్స్ వస్తున్నాయి.బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇచ్చిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. బాలకృష్ణ గారి మైల్ స్టోన్ సినిమాకి మేము నిర్మాతలు కావడం చాలా ఆనందంగా వుంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన గోపీచంద్ మలినేని కి కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు


తమన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు ఒక కాలేజ్.ఆయన్ని చూస్తూ చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆయనకి మ్యూజిక్ ఎంతైనా అడుగుతుంది. అఖండ తర్వాత చాలా అంచనాలు వున్నాయి. మళ్ళీ అలాంటి సౌండ్ ని వీరసింహా రెడ్డిలో క్రియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాలయ్యగారి పై వున్న ప్రేమని మరోసారి చూపించే అవకాశం వచ్చింది. అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన బాలకృష్ణ గారికి, దర్శకుడు గోపికి, నిర్మాతలుకు కృతజ్ఞతలు’’ తెలిపారు.


వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ. వీరసింహారెడ్డి ని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. భానుమతి పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ముఖ్యంగా బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు.



Share this article :