Home » » Shakuntalam Trailer Launched Grandly

Shakuntalam Trailer Launched Grandly

గుణ శేఖర్‌గారిలాంటి ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్‌తో.. దిల్‌రాజుగారిలాంటి ప్యాష‌నేట్ ప‌ర్స‌న్‌తో ‘శాకుంతలం’ లాంటి విజువల్ వండర్‌లో వర్క్ చేయటం నా అదృష్టం :  స‌మంత అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న  అద్భుతమైన పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం’. ఇండియ‌న్ సినీ ప్రేక్ష‌కులు 2023లో చూడాల‌నుకుని ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న విజువ‌ల్ వండ‌ర్‌గా శాకుంత‌లం త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. అందాల సుంద‌రి స‌మంత ఇందులో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమ‌గాథ‌నున‌ భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా గుణ‌శేఖ‌ర్ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో... 


స‌మంత మాట్లాడుతూ ‘‘ఈ క్ష‌ణం కోస‌మే నేను, మా శాకుంత‌లం టీమ్ ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా ఇక్క‌డ‌కు రావాల‌ని ఫిక్స్ అయిపోయి బ‌లం తెచ్చుకుని వ‌చ్చాను. గుణ శేఖ‌ర్‌గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వ‌ల్ల వ‌చ్చాను. ఆయ‌న‌కు సినిమానే జీవితం. ప్ర‌తి సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు. ఈ సినిమాను కూడా అలాగే తీశారు. నెరేష‌న్ విన్న‌ప్పుడూ యాక్ట‌ర్స్ అంద‌రూ సినిమా అలాగే రావాల‌ని కోరుకుంటారు. కొన్నిసార్లు మాత్ర‌మే మా ఊహ‌ను దాటి ఎక్స్‌ట్రా మ్యాజిక్ జ‌రుగుతుంది. సినిమా చూసిన త‌ర్వాత నేను చూసిన త‌ర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఊహించిన దాని కంటే సినిమా ఎన్నో రెట్లు బావుంది. చూడ‌గానే గుణ శేఖ‌ర్‌గారి పాదాల‌పై ప‌డి థాంక్యూ చెప్పాను. దిల్ రాజుగారికి థాంక్యూ. శాకుంత‌లం అనే మ్యాజిక‌ల్ వరల్డ్‌ను క్రియేట్ చేయాలంటే ఏ లిమిట్‌, క్యాలిక్యులేష‌న్స్ లేకుండా న‌మ్మ‌కంతో చేయాలి. అలాంటి ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌ని దిల్‌రాజుగారి రూపంలో చూశాను. మంచి సినిమా తీయాల‌నే ఆయ‌న చూస్తారు. ఈ సినిమాలో చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులున్నారు. 


నేను సెట్స్‌లోకి రెడీ అయ్యి అడుగు పెట్టిన త‌ర్వాత అక్క‌డున్న అమ్మాయిల రియాక్ష‌న్ చూసి ప‌ర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడ‌ని ఫిక్స్ అయ్యాను. కాళిదాసుగారు 5వ శ‌తాబ్దంలో రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగాచేస్తోన్న శాకుంత‌లం సినిమా కోసం న‌న్ను గుణ శేఖర్‌గారు ఎంపిక చేయ‌టం నా అదృష్టం. నేను జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాను. అయితే మారన‌ది ఒక‌టే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను.. సినిమా న‌న్ను ఎంత ప్రేమిస్తుంద‌నే విష‌యం. శాకుంత‌లంతో ఈ ప్రేమ మ‌రింత పెరుగుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు. 


దిల్ రాజు మాట్లాడుతూ ‘‘శాకుంతలం సినిమాను 2020లో నాకు వినిపించారు. అమ్మాయిని ప్రొడ్యూసర్ చేస్తున్నారు. అది ఆయ‌న‌కెంత బ‌ర్డ‌నో నాకు తెలుసు. నేను వ‌చ్చిన త‌ర్వాత అదింకా ఎక్కువైంది. ఇప్పుడే ఆయ‌న గురించి ఎక్కువ చెప్ప‌లేను. స‌మంత గురించి చెప్పాలంటే.. స్టోరి విన్న త‌ర్వాత ఎవ‌రిని తీసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు స‌మంత గురించి అనుకుని బావుంటుంద‌ని ఆమెను క‌లిశాం. క‌థ బావుంది కానీ.. విజువ‌ల్‌గా సినిమా ఎలా వ‌స్తుందోన‌ని అనుకుంది. క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో చేసేసింది కానీ.. ఎక్క‌డో త‌న‌కు డౌట్ ఉండేది. విజువ‌ల్‌గా చూసిన త‌ర్వాత నాకు ఫోన్ చేసి.. డైరెక్ట‌ర్‌గారు ఏం చెప్పారో దాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. నా క్యారెక్ట‌ర్ బావుంది సార్‌..సూప‌ర్ సర్‌.. అని ఫోన్ చేసి చెప్పింది. గుణ శేఖ‌ర్‌గారికి ఇంత‌కు ముందు సినిమాల ఎక్స్‌పీరియెన్స్‌.. త‌న క‌థ‌ను సినిమాగా ఎలా చూపించాల‌నుకున్నాడు.. నెక్ట్స్ జ‌న‌రేష‌న్స్ శాకుంత‌లం సినిమాను ఎలా ప్రెజెంట్ చేయాల‌నుకున్నార‌నేది ఈ ట్రైల‌ర్ ఓ ఎగ్జాంపుల్‌. డైరెక్ట‌ర్ అనుకున్న దానికి స‌మంత ఇచ్చిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీ బ్యూటీఫుల్.. సూప‌ర్బ్‌. దేవ్ మోహ‌న్ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశాడు. భ‌ర‌తుడు క్యారెక్ట‌ర్ కోసం బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఆయ‌న్ని ఒప్పించేసి అర్హ‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు. యూనివ‌ర్స‌ల్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా సినిమాను తీసుకెళుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. బ్యూటీఫుల్ ఎపిక్ మూవీ. ఈ క్రెడిట్ అంతా గుణ శేఖ‌ర్‌, స‌మంత‌కే ద‌క్కుతుంంది’’ అన్నారు. 


నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘మా శాకుంతలం టీమ్‌కీ మీ ఆశీర్వాదం కావాలి. మేం చాలా మంచి సినిమాను తీశామ‌ని అనుకుంటున్నాను. మీ అంద‌రికీ సినిమా నచ్చుతుంది. స‌మంత‌కు థాంక్స్‌. త‌ను, దేవ్ మోహ‌న్ చాలా ఎఫ‌ర్ట్స్ పెట్టి యాక్ట్ చేశారు. దేవ్ అయితే తెలుగు కూడా నేర్చుకున్నారు. మా నాన్నగారు .. చాలా విజువ‌ల్ వండ‌ర్స్ క్రియేట్ చేశారు. ఆ కోవ‌లోకి శాకుంత‌లం సినిమా కూడా చేరుతుంద‌ని అనుకుంటున్నాను. దిల్ రాజుగారు.. గ్రేట్ స‌పోర్ట్‌. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి మా పై న‌మ్మ‌కంతో అండ‌గా నిల‌బ‌డి ఇన్‌స్పైర్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఎలా ఆదరిస్తార‌నే దానికి ఇప్పుడు స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న ఒక్క‌డు సినిమా ఓ ఎగ్జాంపుల్‌. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. శాకుంత‌లం సినిమాలో ముగ్గురు హీరోలు. క‌థ ప్ర‌కారం దేవ్ మోహ‌న్ క‌థానాయ‌కుడు అయితే, సినిమాకు స‌మంత హీరో. సినిమా వెనుక హీరో దిల్ రాజుగారు. ఈ సినిమా క్రెడిట్ దిల్ రాజుగారికే ఇస్తాను. మ‌నలాంటి ద‌ర్శ‌కులు మంచి సినిమాలు తీయాలంటే దిల్‌రాజు వంటి నిర్మాత‌లు అవ‌స‌రం. ఆయ‌న‌లాంటి వాళ్లు ఉంటేనే ద‌ర్శ‌కులుగా మేం అనుకున్న సినిమాను తీయ‌గ‌లిగాం. ఈరోజు నాకు ఆయ‌న దొరికారు. శాకుంత‌లం సినిమాకు ఏడాది ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేశాం.. షూటింగ్ ఆరు నెల‌లు మాత్ర‌మే చేశాం.. ఏడాదిన్న‌ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్నాం. ప్రాప‌ర్ సినిమా చేశాం. ప్రేక్ష‌కుల న‌మ్మ‌కాన్ని ఏమాత్రం వ‌మ్ము చేయం. చెక్కే ద‌ర్శ‌కుల‌ను చూశాం. కానీ చెక్క‌మ‌నే నిర్మాత దిల్‌రాజుగారు. మేక‌ర్ స‌పోర్ట్ ఉంటే ఎలాంటి సినిమాలు చేస్తారో నాకు తెలుసు అని ఆయ‌న ధైర్యంగా ముందుకెళ్ల‌మ‌న్నారు. నేను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు తీశాను. చాలా హ్యాపీ.. కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. 


స‌మంత గురించి చెప్పాంలంటే.. శకుంత‌ల పాత్ర‌కు ఎంద‌రినో అనుకున్నాం. మా అమ్మాయి నీలిమ యు.కె నుంచి వ‌చ్చి నిర్మాత‌గా మారుతాన‌ని చెప్పి మంచి క‌థ చెప్ప‌మంది. నేను సోష‌ల్ క‌థ చెబుతుంటే నేను పాతికేళ్ల ముందు తీసిన రామాయ‌ణం త‌ర‌హా మైథిలాజిక‌ల్ క‌థ చెప్ప‌మంది. అప్పుడు శాకుంత‌లం సెల‌క్ట్ చేసుకుంది. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్స్‌కు మ‌న భార‌తీయ సంస్కృతి గొప్ప‌త‌నం చెప్పి తీరాలి నాన్నా అని అంది. త‌న విజ‌న్‌లో కావ్య నాయ‌కి స‌మంత‌. త‌ను మోడ్ర‌న్‌గా ఉంటుంది క‌దా.. అని అనిపించినా.. క‌థ చ‌దువుతూ స‌మంత అయితే ఎలా ఉంటుంద‌ని ఆలోచించాను. అప్పుడు త‌ను చేసిన రామ‌ల‌క్ష్మి పాత్ర గుర్తుకు వ‌చ్చింది. అంత మోడ్ర‌న్ అయిన స‌మంత‌గారు విలేజ్ అమ్మాయిగా ఎలా మెప్పించారో తెలిసిందే. 


స‌మంత‌కు క‌థ చెబుతున్న‌ప్పుడు నాకు శ‌కుంత‌ల‌గా స‌మంత‌నే క‌నిపించింది. కానీ ఈ క‌థ‌ను సినిమాగా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలి. మామూలుగానే పెద్ద సినిమాల‌ను నెత్తిన పెట్టుకుంటాడు. ఇప్పుడు దీన్ని ఎలా తీస్తాడు. ఎన్ని కోట్లు కావాలి. ఆయ‌నే ప్రొడ్యూస‌ర్ .. ఆయ‌న‌కు మ‌రో మేక‌ర్ ఉంటే అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా తీస్తాడు క‌దా.. అని దిల్ రాజుగారు ఎంట‌ర్ అయ్యారు. స్కై ఈజ్ లిమిట్‌గా సినిమా చేయ‌మ‌న్నారు. స‌మంత ఇక్క‌డ సూప‌ర్‌స్టార్. ఆమెకు త‌గ్గ క‌థ ఇచ్చారు. క‌థ పొటెన్షియ‌ల్‌కు త‌గ్గట్లు ఎంత పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టండి అని దిల్ రాజుగారు అన్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ ఇండియ‌న్ సినిమాల్లోనే ఇది కాస్ట్ లీ మూవీ. ఒక హీరోయిన్‌ని న‌మ్మి ఇన్ని కోట్లు దిల్‌ రాజుగారు ఖ‌ర్చు పెట్ట‌టం.. నాపై న‌మ్మకంతో టీమ్ వ‌ర్క్ చేసింది. శాకుంత‌లం మ‌న సంస్కృతి. పౌరాణిక చిత్రాలు రావ‌ట‌మే అరుదు. అలాంటి సినిమా భ‌విష్య‌త్ త‌రాల‌కు ప్రామాణికంగా ఉండాలి అన్న‌ట్లుగానే మ‌హా క‌వి కాళిదాసు.. రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం బేస్ చేసుకుని ఈ సినిమా తీశాను. మ‌న‌దేశంలో అభిజ్ఞాన శాకుంత‌లం సినిమాకు ఎంత మంది అభిమానులుంటారో .. విదేశాల్లోనూ అంతే మంది ఉంటారు. ఓ రీసెర్చ్ టీమ్‌ను పెట్టి ప్రాప‌ర్‌గా ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ని స్టాండ‌ర్డ్స్ మెయిన్ టెయిన్ చేస్తూ  సినిమా తీశాం. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా.. క‌రెక్ట్ క్లాసిక‌ల్ మీట‌ర్ పట్టుకుని మూడేళ్ల‌పాటు క‌ష్టం ఇది. రేపు సినిమా వ‌చ్చిన త‌ర్వాత ఇంత కంటే గొప్ప రెస్పాన్స్ వ‌స్తుంది’’ అన్నారు. 


స‌మంత టైటిల్ పాత్ర‌ధారిగా న‌టించిన శాకుంత‌లం చిత్రంలో  డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.


గుణ శేఖ‌ర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ చేసిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణి శ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువ‌ల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్‌, హంగేరిలోని సింఫ‌నీ టెక్నీషియ‌న్స్ చేయ‌టం విశేషం.Share this article :