Kannada Superstar Shivarajkumar Veda First Look Launched

 కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన "వేద" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల



కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.

ప్రస్తుతం శివ రాజ్‌కుమార్‌ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం.


ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో తెలుగు రిలీజ్ కు సిద్దమవుతుంది. కంచి కామాక్షి కలకత్తా కాళీ  క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం.


ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలైంది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు.


నటీనటులు: శివరాజ్ కుమార్ , ఘనవి లక్ష్మణ్

దర్శకత్వం : హర్ష

నిర్మాత : గీతాశివరాజ్‌కుమార్

సినిమాటోగ్రఫీ : స్వామి జె గౌడ్

ఎడిటర్: దీపు ఎస్ కుమార్

సంగీతం: అర్జున్‌జన్య

పి.ఆర్. ఓ: వి. ఆర్ మధు

డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం


Post a Comment

Previous Post Next Post