Home » » V N Aditya Valliddari Madhya on Aha from 16th Dec

V N Aditya Valliddari Madhya on Aha from 16th Dec

 ఆహాలో ఈ నెల 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న దర్శకుడు వీఎన్ ఆదిత్య "వాళ్ళిద్దరి మధ్య" మూవీవిరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటించిన సినిమా "వాళ్ళిద్దరి మధ్య". ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య తెరకెక్కించారు. కాంటెంపరరీ లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమా నేరుగా ఈ నెల 16 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫన్ అండ్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో


దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ, " డబ్బున్న వారి కంటే చదువుకున్న నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలి. అలాంటి నిర్మాత అర్జున్ దాస్యన్. సినిమా అంటే ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. నా కెరీర్ లో చూసిన బెస్ట్ ప్రొడ్యూసర్. సహజత్వానికి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రమిది. రెండు షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ లో విరాజ్ అశ్విన్ బాగా నటించాడు. తన తోటి యాక్టర్స్ లో ఎలాంటి పాత్రనైనా పోషించగల నటుడు విరాజ్. హాలీవుడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న నేహా కృష్ణను ముందు తెలుగు సినిమా చేయి అని తీసుకొచ్చాను. నాయక నాయికల మధ్య ప్రధానంగా సాగే చిత్రమిది. నాకు మరొక మంచి సినిమా అవుతుంది." అని అన్నారు.


నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ...ఒక మంచి చిత్రాన్ని నిర్మించాము. దాని ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కుటుంబంతా కలిసి హాయిగా చూసేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా విషయంలో రెండు సంస్థలకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మేము మొత్తం వర్క్ చేసుకున్న ప్రసాద్ ల్యాబ్స్ సంస్థ. రెండవది రిలీజ్ చేస్తున్న ఆహా ఓటీటీ. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలనే మాలాంటి నిర్మాతలకు ఒక మంచి ఆప్షన్ అయ్యింది ఆహా. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తోంది. మా సినిమాను ఆహాలో చూస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


ఆహా నుంచి శ్రీనివాస్ మాట్లాడుతూ....వీఎన్ ఆదిత్య గారు నేనూ ఒకే కాలేజ్ లో చదువుకున్నాం. ఆయన కైండ్ ఆఫ్ సినిమాలంటే నాకు ఇష్టం. వాళ్లిద్దరి మధ్య ఒక యూత్ పుల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.


హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ...దర్శకుడు వీఎన్ ఆదిత్య కథ చెప్పినప్పుడు చాలా బాగుందని అనిపించింది అయితే ఆల్ మోస్ట్ డ్యూయల్ రోల్ లాంటి పాత్రలో నేను నటించగలనా అనే భయమేసింది. ఆదిత్య గారు నాకు ముందు నుంచీ పరిచయం. ఆయన చెప్పిన ధైర్యంతో ఈ క్యారెక్టర్ బాగా చేశాను. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది. టెక్నికల్ గా మూవీ అంతే బాగుంటుంది. నా కెరీర్ లో గుర్తుండే సినిమా అవుతుంది. అన్నారు.

  

విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ ,వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్, నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు. స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి .పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా:  రాకేష్ కోలంచి , ఆర్ట్:  జెకే మూర్తి,  ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్  నిడమానూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూరపనేని కిషోర్, నిర్మాత: అర్జున్ దాస్యన్, కథ - దర్శకత్వం : వి.ఎన్. ఆదిత్య.


Share this article :