Terrific Response for Santhosham OTT Awards

 డిసెంబర్ 21న సంతోషం OTT అవార్డ్స్

అబ్బుర పరుస్తున్న ప్రోమో




కళని గుర్తించటం మన సహజగుణం..

కళని గౌరవించటం మన బలం:

కానీ కళని ప్రోత్సహించటం మన భాద్యత

ఆ భాద్యతని 20 ఏళ్ళుగా అలుపు లేకుండా నిర్వహిస్తూ ఇప్పుడు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది మన సంతోషం అవార్డ్స్, అవును నిజమే, మీరు సరికొత్త ఎక్స్ పీరియన్స్ చేయబోతున్నారు.  ఒకప్పుడు వీధినాటకాలు తరువాత రాయల్ టాకీస్ లో సినిమాలు ఆ తరువాత DTS థియేటర్ లు మారుతున్నా కాలంతో పటు మోడ్ ఆఫ్ ఎంటర్ టైన్మెంట్ కూడా మారుతూ వస్తుంది. ఇక్కడ మనము గుర్తించాల్సింది ఒక్క కాలాన్నే కాదు కళను కూడా  చిన్న బడ్జెట్ సినిమా కి పెద్ద ప్లాట్ ఫామ్ గా మారిన ott ని మన తెలుగు ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో మనకు తెలిసిందే. ఆ OTT లో వచ్చిన సినిమాలకి వెబ్ సిరీస్ లకి గుర్తింపుతో పాటు నూతన ప్రతిభని ప్రోత్సహించాలి అనే ముఖ్య ఉద్దేశంతో తెలుగు సినిమా చరిత్ర లోనే మొట్ట మొదటి సరిగా తెలుగు OTT Awards ని మన అందరికి సుపరిచితం అయినా సంతోషం అవార్డ్స్ నిర్వహించబోతుంది. 21 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లోని ది వెస్టిన్ హోటల్ లో ఘనంగా జరగబోతోంది. ఇక ఈ అవార్డుల కార్యక్రమంలోనే సంతోషం 2022 అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం, సంతోషం ఫిలిం న్యూస్ 1000 ఎపిసోడ్ల గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరపబోతున్నారు.  ఇక ఈ కార్యక్రమానికి చెందిన ప్రోమో రిలీజ్ కాగా అది అందరినీ ఆకట్టుకుంటుంది


Post a Comment

Previous Post Next Post