Ganavi Laxman Bujjamma Look From Rudrangi Launched

 'రుద్రంగి' సినిమా నుంచి గానవి లక్ష్మణ్ నటిస్తున్న బుజ్జమ్మ క్యారెక్టర్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్




సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది 'రుద్రంగి'. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 


'రుద్రంగి' చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన కీలక పాత్రల పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ లుక్ లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా 'రుద్రంగి' సినిమా నుంచి గానవి లక్ష్మణ్ నటిస్తున్న బుజ్జమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇంట్లో ముద్దుగా పెరిగిన బుజ్జమ్మ మేకపిల్లను పట్టుకుని అందంగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.


భారీ నిర్మాణ హంగులతో తెరకెక్కిస్తున్న 'రుద్రంగి' టాలీవుడ్ లో మరో విజువల్ వండర్ గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ఇతర  పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - సంతోష్ శనమోని, ఎడిటింగ్ - బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంగీతం - నాఫల్ రాజా ఏఐఎస్.

Post a Comment

Previous Post Next Post