Nachhindhi Girl Friendu Censor Completed

 సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొందిన ఉదయ్ శంకర్ "నచ్చింది గాళ్ ఫ్రెండూ" మూవీ




ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న సినిమా నచ్చింది గాళ్ ఫ్రెండూ. జెన్నీ నాయికగా నటిస్తోంది. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ అవుతోంది. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారు. చక్కని థ్రిల్లింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ సినిమా  సెన్సార్ సభ్యులు ప్రశంసలు అందుకుంది.


వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో ఆహ్లాదకరమైన ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలుండబోతున్నాయని మూవీ టీమ్ చెబుతున్నారు. 



నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్,  సీనియర్ హీరో సుమన్,  మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు


సాంకేతక వర్గం: సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్:

ఉడగండ్ల సాగర్, ఆర్ట్: దొలూరి నారాయణ,  పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా, నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్

Post a Comment

Previous Post Next Post