Home » » Hit 2 will be Sure Shot Hit -S.S Rajamouli

Hit 2 will be Sure Shot Hit -S.S Rajamouli

 తెలుగు సినిమా నుంచి వ‌స్తోన్న మ‌రో క్వాలిటీ మూవీ ‘హిట్ 2’... తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు:  ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిఅడివి శేష్ హీరోగా న‌టించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమాపై శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మాత‌గా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భొంగా..


దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఇన్ని రోజులు ఇంగ్లీష్‌లో మాట్లాడి మాట్లాడి చిరాకేసింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంది. హిట్ అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్ర‌శాంతి, శైలేష్‌ల‌కు కంగ్రాట్స్‌. అదంత ఈజీ కాదు.. హిట్ సినిమా చేయొచ్చు కానీ.. ఫ్రాంచైజీ చాలా క‌ష్టం. సాధార‌ణంగా హీరోకో, ద‌ర్శ‌కుడికో ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఓ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండ‌టం అనేది ఇండియాలోనే ఫ‌స్ట్ టైమ్ అని అనుకుంటున్నాను. అలాంటి గొప్ప ఫ్రాంచైజీ చేసినందుకు టీమ్‌కు అభినంద‌నలు. హిట్ 1లో చేసిన విశ్వ‌క్ సేన్‌ ... హిట్ 2లో చేసిన అడివి శేష్  ఓ ఎన‌ర్జీని తీసుకొచ్చారు. హిట్ 2’ ట్రైల‌ర్ (HIT 2 Trailer) చూశాను. చాలా చాలా బాగా న‌చ్చింది. ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమాలోని హ‌త్య‌ల‌ను చేసే హంత‌కుడెవ‌రు.. వెంట‌నే సినిమా చూడాల‌నిపించింది. అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లిగించ‌ట‌మే థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీ స్టైల్ శైలేష్ (Sailesh Kolanu) అందులో కంప్లీట్‌గా స‌క్సెస్ అయ్యాడు. హిట్ 2 చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో డౌటే అక్క‌ర్లేదు. హిట్ 3, హిట్ 4, హిట్ 5 వ‌రుస‌గా వ‌స్తాయి. అందులో డౌట్ లేదు. అయితే ప్ర‌తి సినిమా ఒకే సినిమాలో రావాలి. అది హిట్ సీజ‌న్ కావాలి. అది జ‌నాల‌కు అర్థం కావాలి. సేమ్ డేట్‌, సేమ్ వీక్ రావాలి. అంద‌రూ చాలా బాగా చేశారు. టెక్నీక‌ల్ వేల్యూస్ బావున్నాయి. తెలుగు సినిమా నుంచి వ‌స్తున్న మ‌రో క్వాలిటీ సినిమా ఇది. డిసెంబ‌ర్ 2న (Hit 2 Release date) ‘హిట్ 2 ది సెకండ్ కేస్’తో థియేటర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.


అడివి శేష్ మాట్లాడుతూ ‘‘చాలా ఎగ్జ‌యిటెడ్‌గా, నెర్వ‌స్‌గా ఉన్నాను. ఏం మాట్లాడాలో రాసుకునే వ‌చ్చాను. రాజ‌మౌళిగారు, శోభుగారు స‌హా అంద‌రూ నా కెరీర్ ప్రారంభం నుంచి స‌పోర్ట్ చేశారు. మేం ఎంతో క‌ష్ట‌ప‌డి హార్డ్ వ‌ర్క్ చేసి ఇలా మీ ముందు నిల‌బ‌డుతున్నాం. విశ్వ‌క్ సేన్.. హిట్‌తో హిట్ కొట్టి ద‌మ్కీ ఇచ్చే రేంజ్‌కు చేరుకున్నాడు. అష్టాచ‌మ్మా నుంచి ద‌స‌రా వ‌ర‌కు డిఫ‌రెంట్ రోల్స్‌లో న‌టిస్తున్న నాని న‌చ్చని వాడుండ‌డు. అలాగే నాతో స‌హా నాని సినిమా న‌చ్చ‌నివాడు కూడా ఉండ‌డు. హిట్ 2 సినిమాకు చీఫ్ గెస్ట్ అయిన రాజ‌మౌళిగారు ఇప్పుడు వ‌ర‌ల్డ్ సినిమా ఎంట‌ర్‌టైన్మెంట్‌కు ఆయ‌నే చీఫ్‌.


బాహుబ‌లి సినిమా షూటింగ్ సమయంలో ఆయ‌న్ని చూస్తే అర్థ‌మైంది ఎప్ప‌టికైనా స్టూడెంట్‌లాగానే ఉండాల‌ని. అంద‌రి క‌న్నా ముందుగా వ‌చ్చి.. అంద‌రి కంటే ఆల‌స్యంగా వెళుతూ రేపు ఏం చేయాల‌నేది ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఆయ‌న ద‌గ్గ‌రే నేర్చుకున్నాను. ఎవ‌రినైనా లీడ్ చేయాల‌నుకున్న‌ప్పుడు మ‌నం ఎక్కువ క‌ష్ట‌ప‌డాల‌నే విష‌యాన్ని కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నుంచే నేను నేర్చుకున్నాను. నా వ‌ర్క్ ఎక్స్‌పీరియెన్స్ మెరుగు ప‌డ‌టానికి మూల కార‌ణం బాహుబ‌లి. ఫిల్మ్ స్కూల్‌లా చాలా విష‌యాల‌ను నేర్పించింది. రాజ‌మౌళిగారికి నేను ఏక‌ల‌వ్య శిష్యుడిగా నాకు తెలియ‌కుండా మారిపోయాను. ఆయ‌న వ‌ర్క్‌ను చూస్తూ ఇన్‌స్పైర్ అవుతూ వ‌చ్చాను. న‌టుడిగా ప్ర‌తి సినిమా త‌ర్వాత నెక్ట్స్ సినిమా ఎలా ఉండాలి. ఎలా ఉంటే ఆడియెన్స్‌కి న‌చ్చుతుంద‌ని త‌ప‌న ప‌డుతుంటాను. అదెప్ప‌టికీ అలాగే ఉంటుంది. శైలేష్ రాసుకున్న హిట్ యూనివ‌ర్స్‌లో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. హిట్ 3లో కూడా ఉంటాన‌ని అన‌టం చాలా సంతోషంగా ఉంది. నా గ‌త చిత్రాల‌ను ఏ న‌మ్మ‌కంతో అయితే చూడ‌టానికి వ‌చ్చారో అదే న‌మ్మ‌కంతో నేను ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశాను. డిసెంబ‌ర్ 2న హిట్ 2ను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన త‌ర్వాత దీన్ని హిందీలోనూ డ‌బ్ చేసి రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. త్వ‌ర‌లోనే హిట్ 2 హిందీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘‘హిట్ 2’సినిమా గురించి ఇప్పుడే నేను ఏమీ మాట్లాడను. అందరూ అన్నీ విషయాలను చెప్పారు. డిసెంబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద అందరి ప్రేమ, గౌరవం ఎలా ఉందో చూసే ఉంటారు. అదే ప్రేమ‌, రెస్పెక్ట్‌తో హిట్ సినిమాను చేశాం. ప్రపంచ‌మంతా తిరిగిన రాజ‌మౌళిగారు రాలేన‌ని చెప్పొచ్చు. కానీ ఈవెంట్‌కు రావాల‌నగానే వ‌చ్చారు. ఆయ‌న సొంత బ్యాన‌ర్‌లా ఫీల్ అవుతారాయ‌న. ఆయ‌న ఈ వేడుకకి రావ‌టం గౌర‌వంగా భావిస్తున్నాం. ఆయ‌న అ!, హిట్ 1... ఇప్పుడు హిట్ 2 ఈవెంట్స్‌కి వ‌చ్చారు. శేష్ టెరిఫిక్ యాక్ట‌ర్‌. ప్రేక్ష‌కుల‌ ఇంటెలిజెన్స్‌ని త‌క్కువ వేయ‌కుండా న‌టించే ఓ యాక్ట‌ర్ త‌ను. అలాంటి ఓ యాక్ట‌ర్‌కి శైలేష్‌లాంటి ఓ డైరెక్ట‌ర్ క‌లిసిన‌ప్పుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. దీని త‌ర్వాత హిట్ 3... నుంచి 7 వ‌ర‌కు ఉంటుంది. హిట్ 7లో అంద‌రినీ క‌లుపుతాన‌ని శైలేష్ ఇప్ప‌టికే చెప్పేశాడు. నేను నిర్మాత‌గా కంటే ఆడియెన్‌గా చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను. హిట్ 2 చూసేట‌ప్ప‌టికే హిట్ 3లో హీరో ఎవ‌ర‌నేది అర్థ‌మ‌వుతుంది. మొన్న రాజమౌళిగారు (Rajamouli) హాలీవుడ్ ఫంక్ష‌న్‌కి వెళ్లారు. అప్పుడు ఆయ‌న కోట్ వేసుకున్నారు. చూడ‌గానే ఈయ‌నేంటి హీరోలా ఉన్నార‌నిపించింది. ఆయ‌న్ని డైరెక్ట‌ర్ అని అనేస్తున్నాం. ఆయ‌నలో హీరో ఉన్నారు’’ అని అన్నారు


శైలేష్ కొల‌ను మాట్లాడుతూ ‘‘హిట్ ఫస్ట్ కేస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వ‌చ్చిన రాజ‌మౌళిగారు అది పెద్ద హిట్ అయ్యి.. సెకండ్ కేస్ చేయాల‌ని అన్నారు. ఆయ‌న అన్న‌మాట ఈరోజు నిజ‌మైంది. ఆయ‌న హాలీవుడ్ మూవీలు చేస్తున్నా స‌రే! మా హిట్ ఫ్రాంచైజీల‌కు గెస్ట్‌గా రావాల‌ని కోరుకుంటున్నాను. ఎక్క‌డో కూర్చుని ఓ యూనివ‌ర్స్‌ని క్రియేట్ చేయాల‌ని ఆలోచించాను. ఇప్పుడ‌ది నిజ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది. విక్ర‌మ్ రుద్ర‌రాజుగా న‌టించిన విశ్వ‌క్ ఎక్క‌డికి వెళ్ల‌డు. ఎప్పుడు, ఎలా వ‌స్తాడనేది త‌ర్వాత చెబుతాను. హిట్ 2 గురించి చెప్పాలంటే.. చాలా ఎమోష‌న‌ల్ లేయ‌ర్స్‌ను పెట్టి రాసిన సినిమా ఇది. స్క్రిప్ట్‌ను పెంచ‌డానికి కార‌ణం యూనివ‌ర్స్‌ను పెంచాల‌నే ఆలోచ‌నే. హిట్ 1 కంటే హిట్ 2 పెద్ద‌గా, బెట‌ర్‌గా ఉంటుంది.


థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సౌండ్ డిజైన్‌, విజువ‌ల్స్ అన్నింటిని ప్లాన్ చేసి చేసిన సినిమా ఇది. శ్రీలేఖ‌, సురేష్ బొబ్బిలి మంచి సంగీతాన్ని అందించారు. కె.కెగారు చ‌క్క‌టి సాహిత్యాన్ని ఇచ్చారు. సినిమాకు జాన్ స్టెబార్ట్ ఎడురి నేప‌థ్య సంగీతం అందించారు. అది సినిమాకు. ఇక ట్రైల‌ర్‌కైతే శ్రీచ‌ర‌ణ్ పాకాల ట్యూన్ ఇచ్చారు. రియ‌ల్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. గ్యారీ ఎడిటింగ్ సూప‌ర్‌. త్వ‌ర‌లోనే స్పై సినిమాతో డైరెక్ట‌ర్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీతో నేను అనుకున్న‌ దాన్నెలా ప్రెజెంట్ చేయాల‌నేది ఆయ‌న‌కు బాగా తెలుసు. మా నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఆర్టిస్టుల నుంచి చాలా నేర్చుకున్నాను. మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. అడివి శేష్ ఎలా రిసీవ్ చేసుకుంటావోన‌ని భ‌య‌ప‌డుతూ వ‌చ్చాను. త‌నొక పెద్ద క్వ‌శ్చ‌న్ బ్యాంక్. త‌న‌వ‌ల్లే నేర్చుకోవాల్సిన దాని కంటే ఎక్కువ నేర్చుకున్నాను. ప్ర‌శాంతిగారు, నానిగారి వ‌ల్లే ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. నాని బ్రో .. నా ఆలోచ‌న‌లు ముందు నానికి న‌చ్చుతాయా అని ఆలోచిస్తున్నాను. నా ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్నాను. నాపై న‌మ్మ‌కంతో న‌న్ను ద‌ర్శ‌కుడిని చేశారు. ఆయ‌న నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని భ‌విష్యత్తులోనూ నిల‌బెట్టుకుంటాను’’ అన్నారు.


మీనాక్షి చౌద‌రి మాట్లాడుతూ ‘‘హిట్ 2 రిలీజ్‌కి ద‌గ్గ‌ర‌వుతుంది. కాస్త నెర్వ‌స్‌గా ఉంది. ఆర్య అనే బ్యూటీఫుల్ రోల్ ఇచ్చిన మా డైరెక్ట‌ర్ శైలేష్‌కి థాంక్స్‌. హిట్ యూనివ‌ర్స్‌లో భాగ‌మైనందుకు హ్యాపీగా ఉంది. న‌టిగా చాలా విష‌యాలు నేర్చుకున్నాను. నిర్మాత ప్ర‌శాంతిగారు సూప‌ర్ కూల్ ప్రొడ్యూస‌ర్‌. మ‌ణికంద‌న్‌గారు నా ఆర్య రోల్‌ను చాలా అందంగా చూపించారు. నాతో న‌టించిన ఇత‌ర న‌టీన‌టుల‌కు ధ‌న్య‌వాదాలు. శేష్‌.. స్క్రిప్ట్ సెల‌క్ష‌న్‌, సినిమాలు చేసే విధానం గురించి మాట్లాడుతుంటారు. త‌ను మంచి కో స్టార్. నానిగారు నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్‌. ఆయ‌న న‌టించిన జెర్సీ, శ్యామ్ సింగ‌రాయ్ నాకు న‌చ్చుతాయి. ఆయ‌న నిర్మాత‌గా చేసిన ఈ సినిమాలో పార్ట్ కావ‌టం సంతోషంగా ఉంది. 100 శాతం సినిమా న‌చ్చుతుంది. డిసెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.


ఇంకా ఈ కార్య‌క‌మ్రంలో చిత్ర నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్‌నేని, ప్రొడ్యూస‌ర్ శోభు యార్ల‌గ‌డ్డ‌, హిట్ 1లో హీరోగా న‌టించిన విశ్వ‌క్ సేన్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ అతిథులుగా పాల్గొని హిట్ 2 మూవీ పెద్ద స‌క్సెస్ కావాల‌న్నారు.


Share this article :