Mega Producer Allu Aravind Appreciates Kantara Team

 మట్టిలోంచి పుట్టిన కథే "కాంతార" - మెగా నిర్మాత అల్లు అరవింద్



సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతగా ఆడుతున్న తరుణంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  


ఈ సినిమా రిలీజ్ కంటే ముందు ఒకసారి చూడమని చెప్పాం.చూసి ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం ప్రూవ్ చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో  విష్ణు తత్త్వం, రౌద్ర రూపం చూసాక ఇది సింహాచలం కి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. 


ఈ చిత్రంలో హీరో ఎంత గొప్పగా చేసాడో మీరు సినిమాలో చూసారు.అతను  ఫీల్ అయ్యి చేయడం వలన ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అజనీష్ లోకనాధ్ ఎక్స్ట్రార్డనరీ బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్ ను రికార్డ్ చేసి మ్యూజిక్ తో పాటు వదిలారు. 


ఈ సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి  అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ బన్ని వాసు నాతో చెప్పాడు. ఏంటి బన్ని వాసు ఇంత ఎగ్జైట్మెంట్ చెబుతున్నాడు అనుకున్నాను.  సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది.ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేసాం. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టి ను అడిగాను ఆయన కూడా ఒప్పుకున్నాడు.

Post a Comment

Previous Post Next Post