Home » » Hero Vishwanth Interview About Boy Friend For Hire

Hero Vishwanth Interview About Boy Friend For Hire

 'బాయ్‌ ఫ్రెండ్ ఫర్ హైర్' అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ మూవీ: హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ


 



విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన  రోమ్-కామ్ ''బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో విశ్వంత్ హీరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


 


బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ లో కోర్ ఎమోషన్ ఏమిటి ?


బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ లో మంచి ప్రేమ కథ వుంటుంది. ఇందులో 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ 'కాన్సెప్ట్ ని చాలా ఇంట్రస్టింగ్ చుపిస్తున్నాం. చాలా ఫన్ వుంటుంది.


 


మీరు లవర్ బాయ్ పాత్రలు చేస్తారు ఇందులో ప్లే బాయ్ లా కనిపిస్తున్నారు ?


మొదటిసారి నా కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమా చేస్తున్నా. అయితే పూర్తి ప్లే బాయ్ లా ఇందులో నా పాత్ర వుండదు. దిన్ని చాలా మంది  బోల్డ్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇందులో మోడరన్ కంటెంట్ వుంటుంది తప్పితే  బోల్డ్ ఫిలిం కాదు. చాలా క్లీన్ ఫిల్మ్. చాలా మంచి ఎమోషన్ వున్న లవ్ స్టొరీ.


 


ఇందులో మీ పాత్రని మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందా ?


నా నిజ జీవితానికి  దగ్గరగానే వుంటుంది. నాకు కాస్త సిగ్గు, మొహమాటం ఎక్కువే.


 


హైర్ కాకుండా ఇందులో ఇంకెలాంటి ఎలిమెంట్స్ వుంటాయి ?


పెళ్లి గురించి కూడా ఇందులో ప్రస్తావన వుంది. పెద్దల కుదిర్చిన పెళ్లిలో కూడా ఇద్దరి మధ్య ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉండాలనేది ఇందులో చూపించాం. ఇది చాలా ఇంటరెస్టింగా వుంటుంది. యూత్ ఆడియన్స్ కి నచ్చే సినిమా ఇది.


 


బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ని మీరు ఎంత వరకూ సపోర్ట్ చేస్తారు ?


బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ఎమోషనల్ సపోర్ట్ యాప్. ఈ సినిమాలో నేను చేసింది కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్  గానే వుంటుంది.


 


ఈ సినిమాకి స్ఫూర్తి వుందా ?


ఒక ఫన్ మూవీ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న దానినే ఎంటర్ టైన్ మెంట్ విధానంలో చూపించాం. ద్రువన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు.


 


మీ పాత్రలని ఎలా ఎంచుకుంటారు ?


నేను కథలని నమ్ముతాను. మన కంటే సినిమా గొప్పది. ఒక సినిమా చేసిన తర్వాత అందులో మనం కాదు మన పాత్ర గుర్తుండాలి. అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను.


 


హీరోయిన్ మాళవిక గురించి ?


 


చాలా వండర్ ఫుల్ గా చేసింది. తన కొత్తగా వచ్చినప్పటికీ అన్ని విషయాలు చాలా తొందరగా నేర్చుకుంది. తన పాత్ర చాలా ఇంట్రస్టింగా వుంటుంది.


 


కొత్తగా చేయబోతున్న చిత్రాలు ?


రామ్ చరణ్-శంకర్ గారి సినిమా చేస్తున్నా. కథ వెనుక కథ అనే సినిమా విడుదలకు రెడీగా వుంది. నమో అనే ఎంటర్ టైనర్ వస్తోంది. ఇది చాలా కొత్తగా వుంటుంది. అలాగే కాదల్ అనే సినిమా.


 


భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?


హారర్ తప్ప మిగతా జోనర్ సినిమాలన్నీ చేస్తా. గౌరవప్రదమైన సినిమాలు చేయాలనే వుంటుంది.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్


Share this article :