Home » » Tremendous Response for Telisinavallu Teaser

Tremendous Response for Telisinavallu Teaser

 విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ” తెలిసినవాళ్ళు” చిత్ర టీజర్ కి విశేష స్పందన



సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ సమర్పణలో విప్లవ్ కోనేటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం ” తెలిసినవాళ్ళు” . విభిన్న కథాంశంతో రొమాన్స్ – ఫ్యామిలీ – థ్రిల్లర్ జోనర్స్ కలసిన ఒక కొత్త తరహా కథనంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా రామ్ కార్తీక్ నటిస్తుండగా అతని సరసన  హీరోయిన్ పాత్రలో హేబా పటేల్ నటిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 


ముఖ్య పాత్రలలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది, అందులో భాగంగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఇదివరకే జల్సా చిత్రం రీ రిలీజ్ షోస్ లో భాగంగా ఈ చిత్ర టీజర్ ను ప్లే చేసారు.అప్పుడు కూడా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది.  


ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్ని యదార్థ సంఘటనలు బట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మరిన్ని అప్డేట్స్ ను , రిలీజ్ ను అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం. 



నటీనటులు:

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు 


సాంకేతిక నిపుణులు:


కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకత్వం,నిర్మాత : విప్లవ్ కోనేటి

సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్, సిరెంజ్ సినిమా

సినిమాటోగ్రఫి: అజయ్ వి నాగ్ , అనంత్ నాగ్ కావూరి 

ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల

మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల

లిరిక్స్: డాక్టర్ జివాగో

ఆర్ట్: ఉపేందర్ రెడ్డి

కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్ 

ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ

లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ

కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావు

పీఆర్వో : మధు వీ.ఆర్

డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం, ధీరజ్


Share this article :