Home » » The Ghost Trailer Launched Grandly

The Ghost Trailer Launched Grandly

 గొప్ప నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీపడకుండా చాలా కసితో చేసిన సినిమా 'ది ఘోస్ట్':  ది ఘోస్ట్' రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున



కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల 'ది ఘోస్ట్' విడుదల తేది దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశార. థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా యాక్షన్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుంది.


ది ఘోస్ట్‌గా నాగార్జున పాత్రకు బిగినింగ్ యాక్షన్ బ్లాక్ హైవోల్టేజ్ ఎలివేషన్ ఇస్తుంది. ''డబ్బు, సక్సెస్ ఆనందం కంటే శత్రువులను ఎక్కువ తెస్తుంది'' అని నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో నాగార్జునకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అండర్ వరల్డ్ నుండి అతని సోదరి కుటుంబాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవడంతో శత్రువుల జాబితా మరింత పెరుగుతుంది.


ట్రైలర్ లో నాగార్జున హైలీ ఇంటెన్స్ గా కనిపించి డెడ్లీ స్టంట్స్ లో ఆశ్చర్యపరిచారు. స్టైలిష్ ,యాక్షన్ థ్రిల్లర్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్టయిన ప్రవీణ్ సత్తారు యాక్షన్ సినిమా ప్రేమికులకు ది ఘోస్ట్ ని ఫుల్ మీల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దారు. అలాగే ఇందులో ఫ్యామిలీ, యూత్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్ గా కనిపించారు. నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ పాత్రలు కూడా ఆసక్తికరంగా వున్నాయి.  


రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. నారాయణ్ దాస్ నారంగ్ గారికి నాతో సినిమా తీయాలని కోరిక. అలా ఈ సినిమా మొదలైయింది. ముందుగా నిర్మాతలు సునీల్ నారంగ్  పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గారికి కృతజ్ఞతలు. 'ది ఘోస్ట్' చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా గొప్ప నిర్మాణ విలువలతో తీశారు. ఈ సినిమాని ఒక కసితో తీశాం. ఇందులో సాంకేతిక విలువలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. దర్శకుడు ప్రవీణ్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు అంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ ని కూడా ప్రవీణ్ అద్భుతంగా కట్ చేశారు. ఒక కాన్సెప్ట్ తో వున్న కంటెంట్ ఇది. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం. సాంకేతిక నిపుణుల, నటీనటులు పనితనం గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. అనంతపురం ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాకి బెస్ట్ విశేష్ అందించడం చాలా అనందంగా వుంది. చిరంజీవి గారికి కృతజ్ఞతలు. విడుదలౌతున్న అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి'' అని కోరారు.


దర్శకుడు  ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ..  ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ది ఘోస్ట్ తో నాగార్జున గారు ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్ ని ఇవ్వబోతున్నారు. సినిమా కోసం చాలా ఎక్సయిట్ గా ఎదురుచూస్తున్నాం. మేము ఫైనల్ కాపీ చూసుకున్నపుడు ఎంత ఎక్సయిట్ అయ్యమో ఆ ఎక్సయిట్మెంట్ ప్రేక్షకులకు కూడా వస్తుందని నమ్ముతున్నాను. విజయదశమి రోజు ది ఘోస్ట్ వస్తోంది. మీ అందరి మనసులని గెలుచుకుంటుంది. బిగ్ స్క్రీన్ పై సినిమాని ఎంజాయ్ చేయాలి'' అని కోరారు  


సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. ది ఘోస్ట్ నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాలో నాకు కింగ్ నాగార్జున గారితో యాక్షన్ చేసే అవకాశం వచ్చింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో చేయడం అనందంగా వుంది. నన్ను ఇలాంటి యాక్షన్ రోల్ లో ప్రేక్షకులు ఇప్పటివరకూ చూడలేదు. అక్టోబర్ 5న ది ఘోస్ట్ ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేస్తాని కోరుకుంటున్నాను.

సునీల్ నారంగ్,  జాన్వి, అదిత్ మరార్ ఈ వేడుకలో పాల్గొన్నారు.  


నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.


భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.


భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.



తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.

సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్)

యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల

పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు


Share this article :