Home » » Raghava Lawrence Pics Going Viral

Raghava Lawrence Pics Going Viral

 రజనీని గుర్తు చేసేలా లారెన్స్ పిక్స్ వైరల్ 

2022 డిసెంబర్ 23న రిలీజ్ కు సిద్దమైన రుద్రుడు 

 


కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఇక ఆయన త్వరలో రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్‌ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. శరత్‌ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ కొన్ని ఎక్స్ క్లూజివ్ ఫోటోలు రిలీజ్ చేశారు. ఆ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ తో లారెన్స్ అదరగొడుతున్నారు. ఆయన లుక్ రజనీకాంత్ ను గుర్తు చేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.


Share this article :