నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర
వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా పాటలు, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 14 - తిరుపతి, సెప్టెంబర్ 15 - నెల్లూరు, ఒంగోలు, సెప్టెంబర్ 16 - విజయవాడ, గుంటూరు, ఏలూరు, సెప్టెంబర్ 17 - భీమవరం, రాజమండ్రి, సెప్టెంబర్ 18 - కాకినాడ , వైజాగ్ లో హీరో నాగశౌర్యతో పాటు చిత్ర యూనిట్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులు, అభిమానులని కలసి సందడి చేయనుంది.
అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సంగీతం: మహతి స్వరసాగర్
డివోపీ: సాయిశ్రీరామ్
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్ - తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ - రామ్ కుమార్
డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్
పీఆర్వో: వంశీ, శేఖర్