Block Buster Karthikeya 2 Dubbed in to All Languages by Post Pro

 బ్లాక్ బస్టర్ కార్తికేయ 2 చిత్రాన్ని అన్ని భాషల్లో అనువదించి పాన్ ఇండియా డబ్బింగ్ కంపెని పోస్ట్ ప్రో !!!



కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించిన పోస్ట్ ప్రో వసంత్ గారికి కృతజ్ఞతలు.


తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించినప్పుడు నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాలు ఏకకాలంలో హైదరాబాద్ లో జరిగేటట్లుగా పోస్ట్ ప్రో కంపెనీ డిజైన్ చెయ్యబడింది.


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను మరియు రచయితలను హైదరాబాద్ కు రప్పించి నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పోస్ట్ ప్రో పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ హైదరాబాద్ లో పూర్తి చేయడం జరిగింది. కార్తికేయ 2 చిత్రాన్ని హైదరాబాద్ లో డబ్బింగ్ చెయ్యడం ద్వారా మాకు బడ్జెట్ కంట్రోల్ లో ఉండడమే కాకుండా డైరెక్టర్ తన సినిమా అనువాద కార్యక్రమాలను రోజు చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే వీలు ఉంటుంది, అలాగే చాలా సమయం ఆదా అయ్యింది. సినిమా విడుదల చివరి వరకు మాతోనే ఉండి మాకు అన్ని విధాలుగా సహకరించిన పోస్ట్ ప్రో డబ్బింగ్ కంపెనీ వసంత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు.

Post a Comment

Previous Post Next Post