Powerstar PawanKalyan Launched Kalapuram Trailer

 ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతుల మీదుగా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కళాపురం’ ట్రైలర్ విడుదల




‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’  వంటి రా అండ్ ర‌స్టిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న క‌రుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. సాధారణ సినీ ప్రేక్ష‌కులే కాదు.. సినీ విమ‌ర్శ‌కులు సైతం క‌రుణ కుమార్ డిఫ‌రెంట్ సినిమాలను ఎంపిక చేసుకుని వాటిని తెర‌కెక్కిస్తోన్న తీరుని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌, ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి.. కళాపురం సినిమాను నిర్మిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు న‌టించారు.



ఇప్ప‌టికే విడుద‌లైన క‌ళాపురం సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, పోస్ట‌ర్స్, సాంగ్‌ అన్నీ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచాయి. ఇప్పుడీ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేలా మేక‌ర్స్ క‌ళాపురం సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని చిత్ర యూనిట్‌ను అభినందించారు.


1 నిమిషం 57 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌.. ఆ క్యారెక్ట‌ర్ ఛాలెంజెస్ ఏంటి అనే విష‌యాల‌ను కామెడీ కోణంలో ఆవిష్క‌రించారు. ఓ దర్శ‌కుడు, నిర్మాత క‌లిసి ఒక సినిమాను చేయాల‌నుకుంటారు. అయితే తాను ఉంటున్న క‌ళాపురం గ్రామంలో కొంత సినిమా షూటింగ్ చేయాల‌నే కండీష‌న్ మీద నిర్మాత సినిమాను స్టార్ట్ చేస్తాడు. అయితే డ‌బ్బు కోసం మ‌ధ్య‌లో పోలీసులు, విల‌న్ ఎంట్రీ ఇస్తారు. అలాంటి ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌లిసి సినిమాను ఎలా పూర్తి చేశార‌నేదే సినిమా. స‌త్యం రాజేష్ ఇందులో డైరెక్ట‌ర్ పాత్ర‌ను పోషించారు.


ట్రైల‌ర్ చూస్తుంటే విజువ‌ల్స్  చాలా రిచ్‌గా ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ సినిమాలోని పాత్ర‌ల‌ను చూపించిన తీరు, దాని వ‌ల్ల వ‌చ్చే కామెడీ ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా వన‌వ్విస్తుంది.


స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న క‌ళాపురం చిత్రం.. క‌రుణ కుమార్ రూపొందించిన చిత్రాల‌కు భిన్నంగా ఉంది. ఆగ‌స్ట్ 26న మూవీ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు

Post a Comment

Previous Post Next Post