Home » » Tremendous Response for Matarani Mounamidhi Preview Show

Tremendous Response for Matarani Mounamidhi Preview Show

 మాటరాని మౌనమిది సినిమా ప్రివ్యూ షో కి విశేష స్పందన  




రుద్ర పిక్చర్స్ పతాకంపై మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి హీరో హీరోయిన్ గా సుకు పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "మాటరాని మౌనమిది". ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ తో విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే చిత్రం లో పని చేసిన నటి నటులు టెక్నిషన్స్ అందరు కలిసి "మాటరాని మౌనమిది" ఫస్ట్ కాపీ ని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో వీక్షించారు. చిత్రం చుసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  చిత్రం లో ఇంట్రవెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ అద్భుతంగా ఉంది అని కొనియాడారు. హీరో హీరోయిన్ గా నటించిన నూతన నటీనటులు అందరు దర్శకుడిని కొనియాడారు. 


ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ "ఇది నా రెండో సినిమా. మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. మా టీం అందరం కలసి సినిమా ని వీక్షించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మా టీం అందరం చాలా నమ్మకంగా ఉన్నాం, సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తా" అని తెలిపారు. 



బ్యానర్ : రుద్ర పిక్చర్స్ 


సినిమా పేరు : మాటరాని మౌనమిది


నటి నటులు : మహేష్ దత్తా, సోని శ్రీవాస్తవ, శ్రీహరి ఉదయగిరి, సంజీవ్, అర్చన అనంత్, కేశవ్, కాశి, ప్రమోద్, చందు సుమన్ శెట్టి, తదితరులు 


కెమెరా మాన్ : శివరామ్ చరణ్


సంగీతం : అషీర్ లుక్


ఎడిటర్ : శివ సర్వాణి


కథ, కధనం, దర్శకత్వం : సుకు పూర్వాజ్


నిర్మాత : రుద్ర పిక్చర్స్


Share this article :