ఇంద్రసేన హీరోగా సాప్పని బ్రదర్స్ పాన్ ఇండియా ఫిలిం ‘శాసనసభ’ మోషన్ పోస్టర్ విడుదల
ఇంద్రసేన హీరోగా ఐశ్వర్యరాజ్ హీరోయిన్‌గా డా.రాజేంద్రప్రసాద్, సోనియ అగర్వాల్, హెబ్బాపటేల్, పృథ్వీరాజ్ కీలకపాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై సాప్పని బ్రదర్స్‌గా పాపులరైన తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్‌పోస్టర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ
సందర్భంగా ఆయన మట్లాడుతూ ‘ఈ చిత్ర కథానాయకుడు ఇంద్రసేన 12 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం మంచి సెటప్ కుదిరింది. ఈ సినిమా ఇంద్రసేనతో పాటు టీమ్ అందరికి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కథానాయకుడు ఇంద్రసేన మాట్లాడుతూ ‘గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ చిత్రంతో రచయిత రాఘవేంద్రరెడ్డి మంచి కమర్షియల్ కథ ఇచ్చాడు. నాకోసమే ఈ కథను తయారుచేసిన ఆయనకు నేను జీవితాంతం బుణపడి వుంటాను. నాకు ఎటువంటి ఇమేజ్ లేకున్నా నాతో ఇంత బడ్జెట్ పె ట్టిఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలను నా జీవితంలో మరిచిపోలేను. ఈ శాసనసభ నా కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలుస్తుంది’ అన్నారు. నిర్మాత షణ్ముగం సాప్పని మట్లాడుతూ ‘కథలోని కంటెంట్ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం నిర్మాతలుగా మాకు మంచి గుర్తింపును తెస్తుంది’ అన్నారు. నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ‘ఇంద్రసేనను చూస్తుంటే కేజీఎఫ్ హీరో యశ్‌కు తమ్మునిలా వున్నాడు. ఈ చిత్రంలో దర్శకుడు నాకు విభిన్నమైన విలన్ పాత్రను డిజైన్ చేశాడు. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ పాత్రలు కూడా ఎంతో బాగా కుదిరాయి. త్వరలో అందరం ఓ అద్భుతమైన సినిమను చూడబోతున్నాం’ అన్నారు. రచయిత రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ‘ 25 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా, పీఆర్‌ఓగా పనిచేశాను. ఈ చిత్రంతో రచయితగా మారాను. అద్బుతమైన కథ కుదిరింది. ఈ కథను బాగా నమ్మింది ఇంద్రసేన. ఇక అదే నమ్మకంతో నిర్మాతలు ఈ సినిమాను లావిష్‌గా నిర్మించారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బసురు సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఇంద్ర రూపంలో ఓ మంచి యాక్షన్ హీరో దొరికాడు. తప్పకుండా ఇది అందరిని అలరించే చిత్రమవుతుంది’అన్నారు. దర్శకుడు వేణు మడికంటి మట్లాడుతూ ‘నిర్మాతలు భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తరువాత తెలుగు సినీ పరిశ్రమ బెస్ట్ హీరో ల్లో ఇంద్రసేన కూడా వుంటాడు. ఈ వేడుకుకు నా అభిమాన దర్శకుడు సురేందర్ రెడ్డి రావడం సంతోషంగా వుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు చిన్ని కృష్ణ, నిర్మాత, ఎమ్‌ఎల్‌సీ వంశీకృష్ణ శ్రీనివాస్, హీరోయిన్ ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, జగదీశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీకృష్ణ, భూషణ్, మహేష్, మయాంక్ తదితరులు పాల్గొన్నారు.