ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చేతుల మీదుగా ‘మరో ప్రపంచం’ చిత్ర ట్రైలర్ విడుదల
చక్ర ఇన్ఫోటైన్‌మెంట్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై కిలారు నవీన్ దర్శకత్వంలో నిర్మాత వెంకటరత్నం నిర్మిస్తోన్న చిత్రం ‘మరో ప్రపంచం’. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన తారాగణంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేశారు. చిత్ర పోస్టర్ లుక్‌ను అతిథులు సాగర్ కె చంద్ర, సాయికిరణ్ అడివి విడుదల చేశారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఈ ట్రైలర్ చూపించాడు. నాకు నచ్చి ఈ కార్యక్రమానికి వచ్చాను. మనందరిలోనే చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి.. అలాంటిది ఓ ఐదుగురి ప్యారలల్ లైఫ్‌లో అలాంటి మార్పులు జరిగితే ఎలా ఉంటుంది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి ప్రయోగం.. అలానే క్వాలిటీతో చిత్రీకరించారు. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఆర్ ఆర్.. సినిమాకు హైలెట్ అవుతుందని అనుకుంటున్నా. ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని.. అలాగే నిర్మాతకు, డైరెక్టర్, ఆర్టిస్టులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.
హీరో వెంకట్ కిరణ్ మాట్లాడుతూ.. ఐదుగురి ప్యారలల్ రోల్స్ ఉన్న కాన్సెప్ట్ రావడం నాకు తెలిసి ఇదే మొదటి సినిమా. ఇలాంటి కాన్సెప్ట్ చేయాలంటే గట్స్ కావాలి. మా నిర్మాత గారికి ఆ గట్స్ ఉన్నాయి కనుకే ఇలాంటి డిఫరెంట్ సినిమాను నిర్మించారు. ప్రేక్షకులకు కూడా నచ్చి తీరందని భావిస్తున్నా అన్నారు.
ప్రొడ్యూసర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. ‘‘కష్టం అంతా దర్శకుడు నవీన్‌దే. నేను జస్ట్ డబ్బు పెట్టాను అంతే. సబ్జెక్ట్ అండ్ ఆర్టిస్టులను నమ్మాను.. వారందరూ 200 పర్సెంట్ న్యాయం చేశారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు.. దాన్నే లీడ్ తీసుకొని 5 ప్యారలల్ మనుషులు మధ్య జరిగే కథే మరో ప్రపంచం. గుడ్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నా. వేరియంట్ సబ్జెక్ట్ చేయాలంటే గట్స్ అండ్ ఫ్యాషన్ ఉండాలని భావిస్తాను. అందుకే ప్రేక్షకులకు నచ్చేలా నవీన్ ఎక్సలెంట్ జాబ్ చేశారు. తప్పక విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను..’’ అన్నారు.
డైరెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. ప్యార్లల్ యూనివెర్సల్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం. టీమ్ అంతా కొత్తవారే అయినా ప్రొడ్యూసర్ సినిమా చేయడానికి ముందుకు రావడం సంతోషం. ఇంకో మూవీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు.. అందుకే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని మాటిస్తున్నా అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సురైయ పర్వీన్, అక్షిత, యామిన్, శ్రీనివాస్ సాగర్, మ్యూజిక్ డైరెక్టర్ శాండీ , సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: సురేష్ గొంట్ల,
మ్యూజిక్ డైరెక్టర్: శాండీ అద్దంకి,
ఎడిటర్: మణిరత్నం పెండ్యాల
కో-డైరెక్టర్: ప్రశాంత్
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాత: వెంకటరత్నం
రచన, దర్శకత్వం: కిలారు నవీన్
Post a Comment