'మీలో ఒకడు' చిత్రానికి పాజిటివ్ టాక్ !
టాలీవుడ్‌లో మరో సినిమా హిట్ కొట్టింది. శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ''మీలో ఒకడు''. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా (శుక్రవారం) విడుదలై థియేటర్‌లలో సందడి చేస్తోంది. ఫస్ట్ డే ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. హైదరాబాద్ మూసాపేట్ లక్ష్మీకళా థియేటర్ వద్ద ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపించడంతో, చిత్రయూనిట్ టీం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్ ల నుంచి పాజిటివ్ సొంతం చేసుకోవడంతో సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కుప్పిలి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'మీలో ఒకడు' ఒక మంచి మెసెజ్ ఇచ్చిందంటూ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెన్సార్ సభ్యులతో ప్రశంసలు అందుకుని U/A సర్టిఫికెట్ సొంతం చేసుకుంది ఈ సినిమా. కుప్పిలి శ్రీనివాస్ సరసన హ్రితిక సింగ్, సాధన పవన్ నటించిన ఈ మూవీలో
సీనియర్ నటులు సుమన్‌తోపాటు, కృష్ణ భగవాన్, సమీర్, అశోక్ కుమార్, బస్టాప్ కోటేశ్వరరావు, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది.