మా "పక్కా కమార్సియల్" సినిమాను క్లియర్ కమర్సియల్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు..విలక్షణ దర్శకుడు మారుతి
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ పతకాలపై గోపీచంద్, రాశి ఖన్నా జంటగా విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మించిన చిత్రం “పక్కా కమర్షియల్”. ప్రపంచ వ్యాప్తంగా జులై 1 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో
చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.అనంతరం
చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ..జులై 1న విడుదలైన "పక్కా కమర్సియల్" సినిమా మేము అనుకున్నట్లే అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. నా సినిమాల్లో ఉండే ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ప్లే చేయడంతో ఎక్కడా ఫన్ తగ్గకుండా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెసేజ్ లు పెడుతున్నారు. నా సినిమాకు వచ్చే ఆడియన్స్ ఏమి ఎక్ష్పెక్త్ చేస్తారో అవన్నీ ఇందులో ఉన్నాయి. నా ప్రివియస్ సినిమాలను హిట్ చేసినట్లే ఈ సినిమాకు వచ్చి చూసి హిట్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. నిన్న అరవింద్ గారు నాతోఈ సినిమా విడుదలైన అన్నీ చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్యాండమిక్ తరువాత వచ్చిన పెద్ద సినిమాల వచ్చాయి ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలకు ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు. అయితే ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరించడంతో షో తరువాత షో కు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. గోపీచంద్ ను చాలా రోజుల తరువాత బాగా చూయించారు , రాశి ఖన్నా ట్రాక్ బాగుంది. రావురమేష్ విలనిజం చాలా బాగుందని, మేము అనుకున్న దానికంటే ఈ సినిమా బాగుందని చెపుతున్నారు. నాకిలాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకా బెటర్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అన్నారు.
చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాము. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. నిన్న సెకండ్ షో నుండి కలెక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి.ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలను కంపారిజన్ చేసి చూస్తే మా సినిమా నిన్న ఆరు కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా సంస్థ నుండి వచ్చిన సినిమాలు హిట్ అయినట్లే అదే పంథాలో వచ్చిన ఈ సినిమా మాస్ ఎంటర్ టైనర్ గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు అన్నారు.
నటుడు సప్తగిరి మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సినిమాకు ఆ మౌత్ టాక్ తో విజయవంతంగా ప్రేక్షకాధరణ పొందుతుంది. మారుతి అన్న మార్క్ కామెడీ తో తీసిన ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకులకను మాత్రం ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
సహ నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ఎలక్షన్ రిజల్ట్ టైమ్ లో బూత్ టాక్ ఏంటి అంటాము.. కలెక్షన్స్ లో మాత్రం మౌత్ టాక్ ఏంటి అంటాము. అయితే ఎక్కడ చూసిన పక్కా కమర్సియల్ మౌత్ టాక్ మాత్రం అదిరిపోయింది. మారుతి, గోపీచంద్, కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ప్యాండమిక్ తరువాత ఎన్నో సినిమాలు ఓపెనింగ్ తెచ్చు కోవడానికి సఫర్ అవుతున్న సమయంలో ఇప్పుడు వచ్చిన గోపీచంద్ సినిమా మొదటి రోజే హైయేస్ట్ ఓపెనింగ్ తెచ్చుకోవడం గొప్ప విషయం. ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం మేము టికెట్స్ రేట్ తగ్గించాము. ఇప్పుడిప్పుడే ఈ సినిమా ఓటిటి లో రాదు కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గమిడి మాట్లాడుతూ..నెల 1 న విడుదలైన ఈ సినిమా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సెంటర్స్ నుండి ఆదరణ లభిస్తుంది..అన్ని చోట్ల కలెక్షన్స్ బాగున్నాయి.. మాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్. అన్నారు.
నటీనటులు :
గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్ – జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్
నిర్మాత – బన్నీ వాస్
దర్శకుడు – మారుతి
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్
మ్యూజిక్ – జకేస్ బీజాయ్
సహ నిర్మాత – ఎస్ కే ఎన్
లైన్ ప్రొడ్యూసర్ – బాబు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ – సత్య గమిడి
ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భవ్
సినిమాటోగ్రఫి – కరమ్ చావ్ల
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్