Home » » Mee lo okkadu Releasing on July 22

Mee lo okkadu Releasing on July 22

 జులై 22న 'మీలో ఒకడు' మూవీ గ్రాండ్ రిలీజ్

 


శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ''మీలో ఒకడు''. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు..సీనియ‌ర్ న‌టులు కృష్ణ భ‌గ‌వాన్ , స‌మీర్ , అశోక్ కుమార్ , బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు , గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.  ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ , సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.. కుప్పిలి శ్రీనివాస్ స‌ర‌స‌న హ్రితిక సింగ్ , సాధన పవన్ న‌టించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని U/A  స‌ర్టిఫికేట్‌ సోంతం చేసుకుంది..సెన్సార్ స‌భ్యుల చేత ప్ర‌సంశలు అందుకున్న  ఈ మూవీని జులై 22న స్ర్కీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్  థియేట‌ర్‌ల‌లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.. హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి క‌థ , క‌థ‌నాల‌తో  ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాకుండా మీలో ఒక‌డు చిత్రాన్ని నిర్మించామ‌ని అన్నారు.. హీరో సుమ‌న్ , హీరో కుప్పిలి శ్రీనివాస్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు , హీరో,హీరోయిన్ల్ మ‌ధ్య రోమాంటిక్ సన్నివేశాలు, గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్ కామెడీ ఈ సినిమా కు హైలెట్ గా నిలుస్తాయ‌ని తెలిపారు.. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, రాసిన పాట‌ల‌ను సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు పాడార‌ని ..ఆ పాట‌లకు ఇప్ప‌టికే  మంచి రెస్సాన్స్ వ‌చ్చింద‌ని, అంతేకాకుండా సీనియ‌ర్ టెక్నిషియ‌న్స్ తో ఈ సినిమా ను క్వాలిటిగా రూపోందించామ‌ని అన్నారు...తెలుగు రాష్ట్రాల‌లో జులై 22న థియేట‌ర్‌ల‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్న ఈ  సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చుతుంద‌ని అశాభావం వ్య‌క్తం చేశారు... 


న‌టీనటులు: లయన్ కుప్పిలి శ్రీనివాస్ (హీరో), హ్రితిక సింగ్ , సాధన పవన్ (హీరోయిన్స్)

నిర్మాణం: లయన్ కుప్పిలి వీరాచారి

స‌మ‌ర్ప‌ణ : శ్రీమ‌తి చిన్ని కుప్పిలి 

కథ , ఐడియా ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : కుప్పిలి శ్రీనివాస్

రచయిత : శివప్రసాద్ ధరణికోట 

పర్యవేక్షణ : కె.ప్రశాంత్ 

మ్యూజిక్ డైరెక్టర్ : జై సూర్య

కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్ 

డి.ఓ.పి :  పి. శ్రీను

ఫైట్స్ : హంగామా కృష్ణ

పాటలు : సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, జై సూర్య

సింగర్స్ : సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు 

ఎడిటర్ : ప్రణీత, ఎన్టీఆర్

పీఆర్వో: అశోక్ ద‌య్యాల‌


Share this article :