Bala Murali Krishna National Awards to Prominent People

 బాలమురళీకృష్ణ జాతీయ అవార్డు గ్రహీతలు డాక్టర్ T.K మూర్తి, శ్రీ M. చంద్రశేఖరన్ & శ్రీ T.H. విక్కు వినాయక్ రామ్.

 



బాలమురళీ నాద మహోత్సవ్ 2022 డా.ఎం.బాలమురళీకృష్ణ యొక్క సంగీత మరియు జీవిత సంఘటనలను గుర్తుచేసింది. డా.ఎం.బాలమురళీకృష్ణ 92వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో సంగీత విద్వాంసుల కలయిక జరిగింది.

భారతీయ విద్యాభవన్ మరియు SSVM సంస్థలతో కలిసి Dr.M. బాలమురళీకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ప్రముఖ మృదంగం ఘాతకుడు డాక్టర్ T.K.

మూర్తి, వయోలిన్ విద్వాన్ శ్రీ ఎం. చంద్రశేఖరన్ మరియు ఘటం శ్రీ విక్కు వినాయక్‌ రామ్ లను వరుసగా 2020, 2021 & 2022 సంవత్సరాలకు గాను డా.ఎం.బాలమురళీకృష్ణ నేషనల్ అవార్డ్ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, మురళీ నాద లహరి బిరుదు మరియు ఒక్కొక్కరికి లక్ష

రూపాయల నగదు పురస్కారం తో సత్కరించింది.

ప్రముఖ సంగీత విద్వాంసుడు డా.టి.వి.గోపాలకృష్ణన్ అధ్యక్షత వహించిన బాలమురళి నాద మహోత్సవం కార్యక్రమంలో శ్రీ కె.ఎన్.

రామస్వామి, డైరెక్టర్, భారతీయ విద్యాభవన్, చెన్నై, మరియు శ్రీ గోపాల కృష్ణన్ ఎం.బాలమురళీకృష్ణతో,వారి అనుబంధాన్ని,జీవితకాల అనుభవాలను పంచుకున్నారు.

అనంతరం అవార్డు గ్రహీతలను సత్కరించారు.


Dr బాలమురళీ కృష్ణ కి స్వర నివాళి అర్పిస్తూ,ప్రధాన శిష్యులైన డా.కె.కృష్ణకుమార్, శ్రీమతి బిన్ని కృష్ణకుమార్ నేతృత్వంలో, మరియు వారి శిష్యులతో "బాల మురళి పంచరత్నం" బృంద గానంతో, కార్యక్రమం ప్రారంభమైంది.


ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలమురళీ కృష్ణ కుటుంబ సభ్యులు హాజరై అవార్డు గ్రహీతలను మరియు ముఖ్య అతిథిని సత్కరించారు. డాక్టర్ కె. కృష్ణ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ, డాక్టర్ బాలమురళీ కృష్ణపై రచించి, స్వరపరిచిన "ప్రత్యేక మంగళం" తో కార్యక్రమం ముగిసింది.

Post a Comment

Previous Post Next Post