Home » » Poye Enugu Poye Trailer Launch

Poye Enugu Poye Trailer Launch

'పోయే ఏనుగు పోయే' ట్రైలర్ విడుదల 




పీకేన్ బ్యానర్ పై కె ఎస్ నాయక్ దర్శకత్వంలో మాష్టర్ శశాంత్ మరో ఇద్దరు చిన్నారులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా పోవనమ్మళ్ కేషవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం 'పోయే ఏనుగు పోయే

ఏనుగు కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ లో ముఖ్య అతిథి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ విడుదల చేసారు. 

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... అప్పుల్లో అడవి రాజా, అడవి రాముడు చిత్రాల్లో ఏనుగులు ప్రధాన పాత్ర పోషించి ఘనవిజయం సాధించిన విషయం విదితమే.. అలాగే చిన్నారులకు సంబందించిన చిత్రాలు సైతం మంచి విజయాన్ని అందుకున్న సంగతీ తెలిసిందే.. అదే తరహాలో చాలా కాలం తరువాత మళ్ళీ ఇప్పుడు ఏనుగు మరియు చిన్నారుల నేపథ్యంతో సినిమా రావడం ఆనందంగా ఉంది. దానికి పోయే ఏనుగు పోయే అనే విభిన్నమైన టైటిల్ పెట్టి ఆకర్షింపచేయడం అనేది మరో ముఖ్య విషయం. ఇలాంటి తరహా సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది ప్రేక్షకులను తప్పక ఆకర్షిస్తుందీ చిత్రం. ఇక నిర్మాతల విషయానికి వస్తే వీరిది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. మంచి సందేశాత్మక చిత్రం కనుక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అటువంటి వీరికి ఈ పోయే ఏనుగు పోయే చిత్రం ఘన విజయం సాధించి మంచి పేరు సంపాదించు కుంటారని ఆశిస్తున్నాను అన్నారు. 

నిర్మాత పవనమ్మాళ్ కేశవన్ మాట్లాడుతూ.. విలన్ కు ఒక నిధి మ్యాప్ దొరుకుతుంది ఆ నిధి దక్కాలంటే ఒక ఏనుగు పిల్లను బలివాలని ఒక మంత్రగాడు చెబుతాడు దాంతో విలన్ అందుకోసం ఒక ఏనుగుల వేటగాడిని కలిసి ఆ ఏనుగును బలివ్వాలని అనుకుంటాడు.. విషయం తెలిసిన ఆ ఏనుగు వేటగాడి కుమారుడు వారి ప్లాన్ ను తప్పించి ఏనుగును ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తాడు అదే ఈ చిత్ర కథాంశం.. ఇందులో బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు ముఖ్యపాత్ర లు పోషించనున్నారు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. 

కో ప్రొడ్యూసర్ లత, మాస్టర్ శశాంత్, గురువా రెడ్డి, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మాస్టర్ శశాంత్,
బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: అశోక్ రెడ్డి, మ్యూజిక్: భీమ్స్, లిరిక్స్: శ్రీ రాగ్, డాన్స్: రిక్కీ మాస్టర్, డైరెక్టర్: కె ఎస్. నాయక్, కథ- స్క్రీన్ ప్లే: అరవింద్ కేశవన్, నిర్మాత: పవనమ్మాళ్ కేశవన్, కో ప్రొడ్యూసర్: లత. పీఆర్ ఓ: వీరబాబు

Share this article :