Nandamuri Balakrishna To Launch chor Bazaar Trailer

 రేపు ‘‘చోర్ బజార్’’ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్న నటసింహం బాలకృష్ణ




ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ

నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్

చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్

పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు

సిద్ధమవుతోంది. 


లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్" సినిమా ట్రైలర్ ను గురువారం (రేపు) నట సింహం బాలకృష్ణ విడుదల చేయబోతున్నారు. తాజాగా హీరో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆకాష్ తండ్రి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ పైసా వసూల్ చిత్రంలో నటించారు. అప్పటి నుంచి బాలకృష్ణతో పూరి కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో ఆకాష్ సినిమాకు సపోర్ట్ చేసేందుకు ఎంత బిజీగా ఉన్నా బాలకృష్ణ ఒప్పుకున్నారు. ఆయనకు చిత్రబృందం థాంక్స్ తెలియజేశారు.  ప్రచార కార్యక్రమాలు జోరందుకున్న "చోర్ బజార్" సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.


సాంకేతిక నిపుణులు - సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్

బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ - గాంధీ నడికుడికర్,

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం

సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో - లహరి, కాస్ట్యూమ్స్

డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను,

పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను ,  స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో -

జీఎస్కే మీడియా,  మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా

- వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ -

ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్

రెడ్డి.

Post a Comment

Previous Post Next Post