Home » » Who is Viraj Reddy ?

Who is Viraj Reddy ?

 ఔనూ.. WHO IS VIRAJ REDDY.. ?



ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’ అంటూ ఓ వార్త ఫొటోతో సహా  హల్‌చల్‌ చేస్తోంది. ముఖ్యంగా మీమ్స్‌ గ్రూప్స్‌లో ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీంతో ప్రస్తుతం యూత్‌తో పాటు అన్ని వయస్సుల వారిలోనూ నిజంగానే ఈ విరాజ్‌రెడ్డి ఎవరు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. యూత్‌ గేదర్‌ అయ్యే ప్రతి చోటా ఈ విరాజ్‌ రెడ్డి గురించే చర్చ జరుగుతోంది. 

అసలు ఎవరు ఈ విరాజ్‌రెడ్డి? రాజకీయ నాయకుడి కొడుకా?.. సినీ యాక్టర్‌ వారసుడా?.. ఎవరైనా బిజినెస్‌ టైకూన్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తా?.. లేక సామాన్యుడా?.. ఇలా అనేక ప్రశ్నలకు తావిచ్చింది  ‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’ పేరుతో విడుదలైన మీమ్స్‌, పోస్టర్‌. ఈ విరాజ్‌రెడ్డి ఎవరు? అని మీకూ తెలుసుకోవాలని ఉందా? అయితే సెర్చింగ్‌ మొదలెట్టండి ‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’ అని, ఖచ్చితంగా సమాధానం దొరికే తీరుతుంది.


Share this article :