Who is Viraj Reddy Details on May 8th

 అందరి ఆలోచనలను తెరదింపుతూ ఈ నెల 8 న ."WHO IS VIRAJ REDDY.. ?" 



ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాల్ చల్ చేస్తున్న పోస్టర్ ‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’.ఇప్పటికే "హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి? అని విడుదల చేసిన పోస్టర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా మీమ్స్‌ గ్రూప్స్‌లో ఇప్పటికీ విపరీతంగా వైరల్‌ అవుతూ అనేక మంది యువకుల గుండెల్లో క్యూరియాసిటీ ని నింపిన

‘హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి?’. అనే ప్రి లుక్ పోస్టర్ కు సమాధానం దొరికింది,రేపు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయటం జరుగుతుంది.


ఈరోజు విడుదలైన ప్రి లుక్ పోస్టర్ చూసిన తరువాత  "హూ ఈజ్‌ విరాజ్‌రెడ్డి? అనే వ్యక్తి "గార్డ్" సినిమాతో హీరో గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయ మవుతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అను ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లోనే కాక ఇంగ్లీష్ మరియు చైనా భాషల్లోనూ భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్

Post a Comment

Previous Post Next Post