వెంకీ కుడుముల చేతుల మీదుగా ఫస్ట్ లుక్- టైటిల్ అనౌన్స్మెంట్ - టీజర్ విడుదల
వెంకీ కుడుముల చేతుల మీదుగా ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, ఎస్ కే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ అప్డేట్స్ విడుదల కానున్నాయి. ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్, ఎస్ కే ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్- టైటిల్ అనౌన్స్మెంట్ అలాగే టీజర్ మే 25వ తేదీన విడుదల కానున్నాయి.. మే 25వ తేదీ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు సినిమా ఫస్ట్ లుక్- టైటిల్ అనౌన్స్మెంట్, అదే రోజు 11 గంటల 21 నిమిషాలకు సినిమా టీజర్ను దర్శకుడు వెంకీ కుడుముల లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాకు అల్లం సుభాష్, సురేష్ కొండేటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మల్లికార్జున తోట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందించిన ఈ సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Post a Comment