యంగ్ హీరో శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా లాంఛనంగా ప్రారంభమైన ‘ఉస్తాద్’ సినిమా
మత్తు వదలవరా, తెల్లవారితే గురువారం వంటి వైవిధ్యమైన చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీసింహా కోడూరి. ఈ యంగ్ హీరో కొత్త చిత్రం ‘ఉస్తాద్’ గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఎ సాయి కొర్రపాటి ప్రొడక్షన్.. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఉస్తాద్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, శ్రీవల్లి, నిర్మాత సాయి కొర్రపాటి, కాల భైరవతో పాటు దర్శకులు వెంకటేష్ మహ, శ్రీనివాస్ గవిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు తదితరులు హాజరయ్యారు.
ముహూర్తపు సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
సినిమాలో హీరోయిన్ సహా ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు :
శ్రీ సింహ కోడూరి తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం : ఫణి దీప్
బ్యానర్స్ : వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాతలు : రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
సినిమాటోగ్రఫీ : పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్ : అకీవా. బి
ఎడిటర్ : కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్ : ప్రవల్య. డి
కాస్ట్యూమ్ డిజైనర్ : అఖిల దాసరి
పాటలు : అనంత్ శ్రీరామ్, రెహమాన్, లక్ష్మీ ప్రియాంక
వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్ : సునీల్ రాజు చింత