Tremendous Response for PelliKuthuru Party Trailer

 ఆసక్తికలిగిస్తున్న పెళ్లికూతురు పార్టీ ట్రైలర్



ప్రిన్స్. అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా,  సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అపర్ణ దర్శకత్వం వహించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం మే 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారంనాడు పెళ్లికూతురు పార్టీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


ట్రైలర్ ఎలా వుందంటే,

మగవారే పెండ్లికి ముందు బ్యాచ్లర్ పార్టీ చేసుకుంటున్నారు. మరి ఆడ వాళ్ళు చేసుకుంటే ఎలా వుంటుందనేది ఇందులో చూపించారు. సరదాగా నలుగురు అమ్మాయిలు బ్యాచ్లర్ పార్టీ చేసుకుందామని ఇంటిలో చెబితే బామ్మనుకూడా తీసుకెళ్ళమంటారు. ఇలా కొంచెం ఫన్నీగా మరికొంచెం సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్తో సాగే రోడ్ జర్నీ కథ ఇది. ప్రిన్స్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. యూత్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా ఈనెల 20న థియేటర్ లో రాబోతుంది.


చిత్రం గురించి నిర్మాత ఎ.వి.ఆర్. స్వామి మాట్లాడుతూ, ప్రధానంగా కామెడీ బేస్డ్ మూవీ. దర్శకురాలు అపర్ణ చాలా ఇంట్రెస్ట్తో సినిమాను రూపొందించారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా కలిసి చూడతగ్గ సినిమా. మే 20న సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు.


దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ, యు.ఎస్.లోకూడా రిలీజ్ అవుతుంది. అన్ని వయస్సులవారికి నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు.


ప్రిన్స్ మాట్లాడుతూ,  శ్రీకర్ అగస్తీ ఇచ్చిన ఆడియో బాగా పాపులర్ అయింది. సినిమాకూడా కొత్తగా వుండబోతుందన్నారు.

Post a Comment

Previous Post Next Post