Mitraaw Sharma in Big BossTop 5 ?

 



బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. ఇంటి సభ్యుల్లో అందరి దృష్టి టాప్5 లో చేరడంపైనే ఉంది. ఇంటి సభ్యుల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకొన్న మిత్రా శర్మపై సినీ,  సోషల్ మీడియా వర్గాలు దృష్టిపెట్టాయి. యువ తారగా,  నిర్మాతగా, సమాజసేవలో భాగమైన మిత్రా శర్మ  బిగ్‌బాస్‌లోకి వచ్చి అనూహ్యంగా ఆదరణను సంపాదించుకొన్నారు. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో సాధారణమైన కంటెస్టెంట్‌గా చేరి... ఇప్పుడు అసాధారణ రీతిలో ఇంటి సభ్యులకు బలమైన ప్రత్యర్థిగా మారింది. 


గత 70 రోజులకుపైగా ప్రయాణంలో రకరకాల టాస్కుల్లో తన  ప్రతిభను చాటుతూ.. నామినేషన్లలో కంటెస్టెంట్లకు  మూడు చెరువుల నీళ్లను తాగిస్తూ.. కంటెస్టెంట్లలో బలమైన ప్లేయర్‌గా పేరు తెచ్చుకొన్నది. ప్రత్యర్థులకు ఆరోపణలకు ధీటుగా సమాధానం చెబుతూ.. ఇతర కంటెస్టెంట్ల లోపాలను ఎత్తి చూపుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా  మారింది. అంతేకాకుండా హోస్ట్ నాగార్జున, ఇంటిలోకి అతిథులుగా వచ్చిన సినీ తారలు, సెలబ్రిటీల ప్రశంసలు అందుకొన్నది.  


శేఖర్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రాజశేఖర్, ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత బిగ్‌బాస్‌ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఒక యాక్టింగ్ స్కూల్‌లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమన్నారు. దాంతో మిత్రా శర్మ వచ్చి తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించారు. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత,  రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. 


ఇక ఆదివారం రోజున టాప్ 5 కంటెస్టెంట్‌లు ఎవరో తేలిపోనున్నది. వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో మిత్రాశర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించింది. టాప్ 5లోనే కాకుండా టైటిల్ రేసులో మిత్రాశర్మ దృష్టిపెట్టింది. మరికొన్ని రోజుల్లో మిత్రాశర్మ  ఎలాంటి ఘనతను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Post a Comment

Previous Post Next Post