Home » » Nallamala Movie Success Meet

Nallamala Movie Success Meet


 


`న‌ల్ల‌మ‌ల` లాంటి సందేశాత్మ‌క చిత్రాలు మ‌రిన్ని రావాలి - యుగ‌ తుల‌సి ఫౌండేష‌న్ చైర్మన్ శివ‌కుమార్


నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవి చరణ్ ‌దర్శ‌కత్వంలో ఆర్‌.ఎమ్‌ నిర్మించిన చిత్రం "న‌ల్ల‌మ‌ల‌". మార్చి 18న థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులనుండి విశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్‌లో.. గో సంర‌క్ష‌ణ విశిష్ట‌త‌ను తెలియ‌జేసేలా సినిమాను రూపొందించిన ద‌ర్శ‌కుడు ర‌వి చ‌ర‌ణ్‌ను యుగ‌ తుల‌సి ఫౌండేష‌న్ చైర్మన్ శివ‌కుమార్ శాలువాతో స‌న్మానించారు.


యుగ‌తుల‌సి ఫౌండేష‌న్ చైర్మన్ కె శివ కుమార్ మాట్లాడుతూ -``గోవులను సంరక్షించుకోవాలనే సందేశాన్ని సినిమా అనే అతిపెద్ద మాధ్యమం ద్వారా ప్రజలకు  వివరించిన దర్శకుడు రవి చరణ్ గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఆవు గురించి చెప్పాలంటే ఆకాశమంత ఉంటుంది. గోవు యొక్క విశిష్టతను మన పూర్వీకులు, ఋషులు, మఠాధిపతులు ఎప్పుడో వివరించారు. అయితే ప్రస్తుత కాలంలో గోరక్షణ జరగడం లేదు. ధర్మ రక్షణ జరగాలంటే గోరక్షణ జరగాల్సిందేనని నినాదంతో ఈరోజు మేము ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాము. కేవ‌లం మంచి సినిమా మా అనే విధంగానే కాకుండా సినిమా చూసి గోసంరక్షణ కచ్చితంగా చేయాల్సిందే అని ఆలోచించేలా దర్శకుడు రవిచరన్ ఈ సినిమాని రూపొందించడం శుభపరిణామం. ఆవు అంతరించిపోతే మానవాళి  క్లిష్ట పరిస్థితులు ఎద‌ర్కోవాలి. మా యుగ‌తుల‌సి ఫౌండేష‌న్  మ‌రియు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌తినిధుల‌తో క‌లిసి గోవును మన జాతీయ ప్రాణిగా ప్ర‌క‌టించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాం. దాని మీద ఉధ్య‌మం కూడా చేస్తున్నాం. ఈ సినిమా ఆ ఉధ్య‌మానికి మ‌రింత బ‌లం చేకూర్చుకుంది. ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటూ ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆ గోమాత ఆశిస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను. గోసంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకునేలా మందుకు నడపాలని కోరుకుంటున్నాను``అన్నారు.


హీరో అమిత్ తివారి మాట్లాడుతూ - ``ఒక మంచి సినిమాకు ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్న మీడియా వారికి ధ‌న్య‌వాదాలు. రెండున్న‌రేళ్ల  మా క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం దొరికింది అనుకుంటున్నాం.  క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా  న‌టించే న‌న్ను న‌మ్మి ఇంత పెద్ద బాధ్య‌త నా మీద ఉంచిన మా నిర్మాత గారికి థ్యాంక్స్‌...మా నిర్మాత‌కు మంచి రెవెన్యూ వ‌చ్చింది. ఆయ‌న సేఫ్ అని విన్నాను. చాలా సంతోషంగా ఉంది. మా తోటి ఆర్టిస్టులంద‌రికీ థ్యాంక్స్‌. మంచి క‌థ‌తో వ‌స్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని మ‌రోసారి నిరూపించారు``అన్నారు.


ద‌ర్శ‌కుడు ర‌విచ‌ర‌ణ్ మాట్లాడుతూ  -  ``మంచి కంటెంట్ కు మంచి ఆదరణ ఉంటుంద‌ని ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు. యుగ‌ తుల‌సి ఫౌండేష‌న్ చైర్మన్ శివ‌కుమార్ గారు సినిమా చూసి  ప్ర‌శంసించ‌డం ఒక అవార్డుగా భావిస్తున్నాను.  సినిమా ఇంత బాగా రావడానికి  మా నిర్మాత నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. ఆయ‌న లేక‌పొతే ఈ సినిమా లేదు.. న‌న్ను న‌మ్మి ప్ర‌తినిమిషం ముందుకు నడిపించారు. అలాగే మాకు స‌పోర్ట్ చేసిని త్రివిక్ర‌మ్ గారికి, దేవ‌క‌ట్టా గారికి, రాఘ‌వేంద్ర‌రావు గారికి, దిల్‌రాజు గారికి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకి సినిమా న‌చ్చింది. నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆద‌ర‌ణ నా అన్ని సినిమాల‌కు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నారు. అమిత్ త‌ప్ప ఆ పాత్ర‌కు ఎవ‌రూ న్యాయం చేయ‌లేరు అని నా స‌న్నిహితులు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు.


నటీన‌టులు:

అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి  శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను


సాంకేతిక నిపుణులు

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్

నిర్మాత: ఆర్.ఎమ్

సినిమాటోగ్రఫీ: వేణు మురళి

సంగీతం, పాటలు: పి.ఆర్

ఎడిటర్: శివ సర్వాణి

ఆర్ట్:  పీవీ రాజు

ఫైట్స్: నబా

స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌

విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్

పిఆర్ఓ – శ్రీ‌ను – సిద్ధు



Share this article :