Home » » Hero Suriya Interview About ET

Hero Suriya Interview About ET

ఇ.టి సినిమా ఇప్పటి జనరేషన్ కూ బాగా కనెక్ట్ అవుతుంది  - సూర్య  విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులను ఒకేసారి పాండమిక్ మార్చేసిందని ఇ.టి. కథానాయకుడు సూర్య తెలియజేస్తున్నారు. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చేలా చేసిందని అన్నారు.  ఇ.టి. (ఎవరికీ తలవంచడు) సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య మీడియా సమావేశంలో చిత్రం గురించి, పాండమిక్ గురించి, భారత చలన చిత్ర రంగం గురించి  పలు విషయాలు ఇలా తెలియజేస్తున్నారు.


- పాండమిక్ తర్వత ప్రతి వారి ఆలోచనలను మార్చేసింది. ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి. ఫ్యామిలీతో ఎలా గడపాలనేది తెలిపింది. నా బంధువులు కూడా తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి జూమ్లో మాట్లాడుకునేవారు. ఇక యూత్ లైఫ్ను మార్చేసింది. పెండ్లిండ్లు కూడా విదేశాల్లో కాకుండా ఇక్కడే చేసుకొనేలా పరిస్థితులు కల్పించింది.


- అదేవిధంగా నా మిత్రుడు మాధవన్ కూడా విదేశాలకు వెళ్ళి వుంటే అక్కడ తన కొడుక్కి స్విమ్మింగ్ నేర్పించాడు. కుటుంబానికి చాలా సమయం కేటాయించాడు. చాలామంది నా బంధువులు, స్నేహితులు కూడా స్వచ్ఛమైన వాతావరణం కోసం రిమోట్ ఏరియాకు వెళ్ళి హాయిగా ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్నారు. నా కుటుంబ సభ్యుల్లో కొందరు కొడై కెనాల్ వెళితే, మరికొందరు గోవా వెళ్ళారు.


- పాండమిక్ బిజినెస్ పరంగా పర్యాటక రంగాన్ని, ఆసుపత్రులను పూర్తిగా మార్చేసింది.  డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో జరగలేదు ఏడాదిన్నర కాలం చాలా ఇబ్బందులు పడ్డారు


- ఒక సైకిల్ షాప్ ఓనర్ రెండున్నర ఏళ్ళు ఒక సైకిల్ కూడా అమ్మలేదట. ఆ తర్వాత మూడు నెలల్లో ఆఫర్లు వస్తే అమ్మడానికి సరుకులేదు. ఇలా వైవిధ్యమైన సంఘటనలు జరిగాయి.


- అదేవిధంగా సినిమా రంగంలోనూ పెను మార్పులు వచ్చాయి. ఆకాశం నీ హద్దురా,  జై భీమ్ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి ఆదరణ పొందాయి. కలకత్తా నుంచి కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు.

- డిజిటల్ బినిజెన్ నిర్మాతలకు బూస్ట్ ఇచ్చింది. కొత్త దర్శకులు, రచయితలు, కొత్త కథలు వెలుగులోకి వచ్చాయి. పాండమిక్ తర్వాత పుష్ప, భీమ్లానాయక్ కూడా థియేటర్లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి. అలా సినిమాలు పెద్ద వ్యాపారం జరిగేలా పరిస్థితులు అనుకూలించాయి.


- డిజిటల్లో అల్లు అరవింద్గారికి చెందిన ఆహా! ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చేలా చేసింది.రాజమౌళి సినిమాలు అన్నిచోట్ల బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది. మలయాళ పరిశ్రమలో కొత్త కంటెంట్లు అందరూ చూసి ఆనందిస్తున్నారు. దాంతో పరిశ్రమ మొత్తం మారిపోయింది.


- ఢిల్లీ నుంచి ముంబై వరకు పలు పొడ్రక్షన్ కంపెనీలు విస్తృతం అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్లో కొత్త ప్రక్రియ వచ్చేసింది. ఫాంటసీ సినిమాలేకాదు కంటెంట్ సినిమాలకు యూత్ పెద్ద పీట వేస్తున్నారు. విప్లవాత్మకమైన ఈ మార్పులు మరింత పురోభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మంచి సినిమాలు వస్తే శుక్ర, శనివారం, ఆదివారం యూత్ బాగా చూస్తున్నారు. దీంతో నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు.


- ఒక్కొక్కరు ఆర్టిస్టుగా ఏం చేయాలనేది గ్రహించారు. పైరసీ అరికట్టి ఓటీటీ కొత్త ఆడియన్స్ను తీసుకువచ్చింది. తమిళనాడులో 8కోట్ల జనాభా వుంటే 80 లక్షల మంది ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. అఖండ, పుష్ప, భీమ్లానాయక్ చిత్రాలు పాండమిక్ తర్వాత బూస్ట్ ఇచ్చాయి. రేపు రాబోయే ఇ.టి. కూడా అంత బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను.


- మా 2డి ఎంటర్టైన్ మెంట్ బేనర్పై కార్తీతో పాండిరాజ్ సినిమా తీశాడు. అది చినబాబుగా తెలుగులో వచ్చింది. పాండిరాజ్ ఫ్యామిలీ సినిమాలు బాగా తీస్తాడు. ఆ సినిమాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చూసి చాలా బాగుందని ట్వీట్ కూడా చేశారు.


 - ఇటి.లో కోర్ పాయింట్ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని  దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ఇ.టి సినిమా.


- మన ఇంటికి బంధువులు వస్తే అమ్మాయితో మంచి నీళ్ళు ఇప్పిస్తారు. అబ్బాయి ఇవ్వడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇందులో చర్చించాం. ఎక్కడా అసందర్భ సన్నివేశాలు వుండవు. అదే విధంగా భార్యా భర్తల మధ్య చిన్న విషయాలు వస్తే సర్దుకుపోవాలని భార్యకు చెబుతారు. ఇలాంటివి దర్శకుడు బాగా చూపించాడు.


- రాజమౌళి, ఆయన ఫాదర్ విలనిజాన్ని హైలైట్ చేస్తారు. వారికి దానిని డీల్ చేయడం తెలుసు. ఇ.టి.లోనూ విలన్  సరికొత్తగా వుంటాడు. ఎంటర్టైన్ మెంట్, ఎమోషన్స్ దర్శకుడు బాగా చూపించాడు. ఇప్పటి జనరేషన్ కూడా బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. నా అభిమానులు కూడా నా కథలు, నన్ను బాగా ఫాలో అవుతున్నారు. వారికి మెప్పించే సినిమా ఇ.టి.

 

- జై భీమ్ అనేది ఆస్కార్కు వెళ్ళింది. అవార్డుకు వెళ్ళిన ఏ సినిమా అయినా యు.ఎస్.లోని మూడు రాష్ట్రాలలో ఆడాలి. కానీ కరోనా వల్ల ఓటీటీకూడా తీసుకుంటున్నారనే లాజిక్తో మేం వెళ్ళాం. చాలామంది మెచ్చుకున్నారు. దాదాపు 3వేల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. వాటి ని జ్యూరీ సభ్యులు చూడాలి.


 - నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. అది యాసలో వుంటుంది. తమిళంలో కూడా ఇలా వుంటే వెరైటీగా వుంటుందని దర్శకుడు చెప్పారు. చిన్న చిన్న డైలాగ్లు చిన్న చిన్న మార్పులు చేశాం.


- కొత్త సినిమాలు పైప్లైన్లో వున్నాయి. దర్శకుడు బాలతో ఏ సినిమా చేస్తున్నా. వెట్రిమారన్తో `వాడి వాసల్` సినిమా చేయాలి. అందులో ప్రతి షాట్కు కనీసం 500 మంది ఆర్టిస్టులు వుండాలి. అందుకే  కరోనా టైంలో అది సాధ్యపడలేదు. జూన్లో ప్రారంభించాలని అనుకుంటున్నాం అని ముగించారు.

Share this article :