ఆద్యంతం ఉత్కంఠభరితంగా అనుపమ పరమేశ్వరన్ ‘బటర్‌ఫ్లై’ టీజర్
‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తర్వాత శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్‌ను గమనిస్తే...
చాలా సంతోషంగా అపార్ట్ మెంట్‌లో అడుగుపెడుతుంది అనుపమ పరమేశ్వరన్. లిఫ్ట్ లో అడుగుపెట్టి తొమ్మిదో ఫ్లోర్ కి చేరుకోవాల్సిన ఆమె రెండు, నాలుగు, ఎనిమిదిలో ఎందుకు ఆగింది? అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యాలేంటి? స్టెప్స్ లో వెళ్లినప్పుడు తెలిసిన విషయాలేంటి? సరదాగా ఉండాల్సిన ఆ వయసులో ఆమెకు అర్థమైన అంశాలేంటి? అనుక్షణం తరిమే ఇంటెన్స్ ఉన్న మ్యూజిక్‌తో ఇంట్రస్టింగ్‌గా ఉంది బటర్‌ఫ్లై టీజర్. అనుపమ ఫ్రెష్ లుక్‌తో కనిపిస్తున్నారు. కెమెరా ఫ్రేమ్ వర్క్ అద్భుతంగా ఉంది.
జెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన థ్రిల్లర్ అని టీజర్ చూడగానే అర్థమవుతోంది. మరి అలాంటి సబ్జెక్ట్ కి బటర్‌ఫ్లై అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది సస్పెన్స్.
ఇటు యువత, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు :
అనుపమ పరమేశ్వరన్
సాంకేతిక వర్గం:
నిర్మాణ సంస్థ : జెన్ నెక్ట్స్ మూవీస్
స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గంటా సతీష్ బాబు
నిర్మాతలు : రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీణ్ నల్లిమెల్లి
సినిమాటోగ్రపీ : సమీర్ రెడ్డి
మ్యూజిక్ : అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా
ఆర్ట్ : విజయ్ కుమార్ మక్కెన
ఎడిటర్ : మధు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నారాయణ
డైలాగ్ రైటర్ : దక్షిణా మూర్తి
లిరిక్ రైటర్ : అనంత శ్రీరామ్
ప్రొడక్షన్ మేనేజర్ & డిజైనర్ : పోతరాజు పాంచజన్య (పింటు)
కెమెరా మెన్ : బాబు గొట్టిపాటి
స్టిల్ ఫొటోగ్రాఫ్ : రాజా
పబ్లిసిటీ డిజైనర్ : అనిల్ భాను
డబ్బింగ్ ఇంజనీర్: పప్పు (శబ్దాలయ)
సౌండ్ ఎఫెక్ట్ : యతిరాజ్
పి.ఆర్.ఓ: వంశీ కాకా
ట్రైలర్ : సుధాన్