Anand Deverakonda birthday poster from GAM GAM GANESHA Movie Launched

 హీరో ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా  యాక్షన్ ఎంటర్ టైనర్ "గం..గం.. గణేశా" నుంచి కొత్త పోస్టర్ విడుదల



సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న

విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ

తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన "దొరసాని",

"మిడిల్ క్లాస్ మెలొడీస్", "పుష్పక విమానం" చిత్రాలు ప్రేక్షకాదరణ

పొందాయి. ఈ ఉత్సాహంలో వరుస చిత్రాలు చేస్తున్నారు. అందులో "గం.. గం..

గణేశా"  ఓ డిఫరెంట్ ఫిల్మ్ కాబోతోంది.


మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా "గం..గం..గణేశా" చిత్రం

నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆనంద్ టైటిల్ పేరు

గణేష్ అని పోస్టర్ ద్వాారా తెలుస్తోంది. మన గణేష్ గాడి స్వాగే సెపరేటు

అంటూ రిలీజ్ చేసిన ఫొటో స్కెచ్ లో పగిలిన కళ్లద్దాలు, తలకు బ్యాండేజ్

చూస్తుంటే గణేష్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు అర్థమవుతోంది.అంతే కాకుండా

నోట్లో సిగరెట్ ద్వారా క్యారెక్టర్ కు ఉన్న స్వాగ్ ను సిగరెట్ చివర్లో

లవ్ సింబల్ చూస్తుంటే హీరో లవ్ ను తెలియజేస్తుంది.ఓవరాల్ గా ఈ పోస్టర్

సినిమాలో హీరో ఆనంద్ క్యారెక్టర్ ను తెలియజేస్తుంది.


హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ

చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం

అవుతున్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఆనంద్

ఇప్పటిదాకా చేయని యాక్షన్ జానర్ ను ఈ చిత్రంతో టచ్ చేయబోతున్నారు.  చేతన్

భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాయికతో పాటు ఇతర నటీనటులు,

సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు - ఆనంద్ దేవరకొండ, తదితరులు.

సాంకేతిక నిపుణులు - బ్యానర్ - హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్, సంగీతం - చేతన్

భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అనురాగ్ పర్వతనేని, పీఆర్వో - జి.

ఎస్.కె మీడియా, నిర్మాతలు - కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, రచన

దర్శకత్వం - ఉదయ్ శెట్టి

Post a Comment

Previous Post Next Post