Home » » Viswak Trailer Launched Movie Releasing on February 18th

Viswak Trailer Launched Movie Releasing on February 18th

 విశ్వ‌క్ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల - సినిమా ఫిబ్ర‌వ‌రి 18న విడుద‌ల‌



అజయ్ కతుర్వార్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న  చిత్రం `విశ్వ‌క్`. గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బేన‌ర్‌పై  తాటికొండ ఆనందం బాల కృష్ణ నిర్మిస్తున్నారు. వేణు ముల్కాకా ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. కాగా, ఈ సినిమా పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగించుకుని సెన్సార్ పూర్తిచేసుకుంది. ఫిబ్ర‌వ‌రి 18న ఈ సినిమా విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్ థియేట‌ర్‌లో విశ్వ‌క్ చిత్రం ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది.


చిత్ర నిర్మాత తాటికొండ ఆనందం బాల కృష్ణ మాట్లాడుతూ, బిందాస్‌గా లైఫ్ గ‌డిచిపోతున్న నాకు ఏదో ప్ర‌త్యేక చూపించాల‌ని సినిమాలోకి ప్ర‌వేశించాను. ద‌ర్శ‌కుడు వేణు క‌థ చెప్పిన‌ప్పుడు నాకు పాఠాలు బోధించిన గురువు గుర్తుకు వ‌చ్చారు. మ‌న భార‌త‌దేశంలో యూత్ యు.ఎస్‌.కు వెళ్లిపోతున్నారు. మిమ్మ‌ల్ని కాదురా వెళ్ళ‌మంది. బ్రిటీష్‌వారిని వెళ్ళ‌మంది.. అనే పాయింట్  న‌న్ను బాగా క‌నెక్ట్‌ చేసింది. నేను అర్జున్ రెడ్డి చూశాక ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డిపై గౌర‌వం పెరిగింది.  కంటెంట్ వుంటే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌నే స్పూర్తి ఆయ‌నే క‌ల‌గ‌జేశాడు. విశ్వ‌క్ ఇందులోని పాత్ర‌లో ఒదిగిపోయాడు. రేపు 18న మీరు థియేట‌ర్‌లో చూసి ఆనందిస్తార‌ని తెలిపారు.


చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ముల్కాకా మాట్లాడుతూ, సినిమా పూర్త‌య్యాక రెండు టీజ‌ర్‌లు విడుద‌ల చేశాం. విడుద‌ల‌కు స‌హ‌క‌రిస్తార‌ని పంపిణీదారుల‌కు, ప్ర‌ముఖుల‌కు చూపించాం. కానీ ఎవ‌రూ ముందుకు రాలేదు. క‌థ ఎన్‌.ఐ.ఆర్‌.ల‌ను టార్గెట్ చేసింద‌ని వారు భావించి వుండ‌వ‌చ్చు. ర‌చ‌యిత ద‌ర్శ‌కుడు అనేవాడు వున్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెబుతాడు. ఈ సినిమాకు మూడేళ్ళ‌పాటు క‌ష్ట‌ప‌డ్డాం. ఇలాంటి క‌థ‌ను అంగీక‌రించిన నిర్మాత‌కు గ‌ట్స్ వుండాలి. నేను మీడియా ద్వారా తెలియ‌జేసేది ఏమంటే, మ‌న ఇండియాలోని మేథావులు వ‌ల‌స‌లు వెళుతుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? స‌త్య నాగెళ్ళ‌, సుంద‌ర్ పిచాయ్ వంటి వారు ఇండియా వ‌స్తే ఎంతో అభివృద్ధి చెండుతుంది. ఒక ఆఫీసులో ఉద్యోగం కోసం త‌గిన‌వారిని ఎంపిక చేస్తామే, అలాంటి దేశం అభివృద్ధి చెందాలంటే మేథావులంతా ఇక్క‌డే వుంటే ఎంతో అభివృద్ధి చెందదా! అన్న కోణంలోనే ఈ సినిమా వుంటుంది. అందుకోస‌మే ఈ విశ్వ‌క్ ప్ర‌పంచ‌మంతా వ్యాపింప‌జేస్తాడ‌నే కాప్ష‌న్‌కూడా పెట్టామ‌ని తెలిపారు.


చిత్ర క‌థానాయ‌కుడు అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ, ఈ సినిమా యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఇలాంటి కంటెంట్ నా ద్వారా హార్డ్‌గా చెబితే వింటారా! అనే అనుమానం మొద‌ట్లో వుండేది.  కానీ మంచి సినిమా తీయాల‌నే క‌సితో నిర్మాత సినిమా తీశారు. అంతే క‌సితో మేం న‌టించాం. మంచి ప‌దిమందికి చేరాల‌నే నిర్మాత అనేవారు. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. కానీ ఈ సినిమా ఎవ‌రినీ వేలెత్తి చూపేదిగా వుండ‌దు. ఎందుకంటే సెన్సార్ వారుకూడా చూసి ఎంతో అభినందించారు. మా పిల్ల‌ల‌కు మేం ఇటువంటి సినిమా చూపిస్తామ‌ని మాతో అన‌డంతో మాకు మ‌రింత బూస్ట్ ఇచ్చిన‌ట్ల‌యింది అని తెలిపారు.

 

 సంగీత ద‌ర్శ‌కుడు సత్య సాగర్ పొలం మాట్లాడుతూ, క‌థ‌కు స‌రిప‌డ్డ బాణీలు కుదిరాయి. గీత‌ర‌చ‌యిత‌లు బాగా రాశారు. ఈ సినిమా చూసిన‌వారంతా ఇండియ‌న్ గా గ‌ర్వ‌ప‌డ‌తార‌ని చెప్ప‌గ‌ల‌న‌ని తెలిపారు.

ఇంకా కెమెరామెన్‌, ప్ర‌దీస్‌, ఎడిట‌ర్ విశ్వ‌నాథ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్ త‌దిత‌రులు మాట్లాడుతూ ఈనెల 18న మంచి సినిమా విశ్వ‌క్ చూసి ఆశీర్వ‌దించండి అని కోరారు.


సాంకేతిక సిబ్బంది-  DOP: ప్రదీప్ దేవ్

దర్శకుడు: వేణు ముల్కాకా

సంగీతం: సత్య సాగర్ పొలం

ఎడిటర్: కె విశ్వనాథ్

పి.ఆర్‌.ఓ. -  తేజస్వి సజ్జా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికాంత్

జలగం

 లైన్ ప్రొడ్యూసర్: ఎం ఉదయ్ భాస్కర్

 ప్రొడక్షన్ మేనేజర్: అల్లూరి చంద్రశేఖర్


Share this article :